Amaravathi Jyothi - Devotional / SPSNellore : భక్తి శ్రద్ధలతో కోటి హనుమాన్ చాలీసా పారాయణం • భక్తులను అలరించిన చావా నాగేశ్వరరావు చాలీసా గానామృతం. కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు శ్రీ జనార్ధన స్వామి ఆలయంలో శ్రీరామచరణ్ హనుమత్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో హనుమాన్ గురు స్వామి హనుమాన్ ప్రసాద్, శ్రీరామ భక్త భవిష్యత్ బ్రహ్మ శ్రీ పంచముఖ ప్రసన్నాంజనేయ ట్రస్ట్ చెమిడిదిపాడు వారి ఆధ్వర్యంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా అయోధ్యలో శ్రీరా మ విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో 108 హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి అర్చక స్వామి అనంత్ స్వామి ఆధ్వర్యంలో పంచ అమృత అభిషేకం నిర్వహించి స్వామివారిని కన్నుల పండుగ అలంకరించారు. శ్రీ జనార్ధన్ స్వామి ఆలయంలో వేకువజాము నుండి 108 చాలీసా పారాయణం ప్రారంభించారు. కందులూరు చావా నాగేశ్వరరావు గురుస్వామి భజన బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం వివిధ బాణీల్లో పారాయణం చేశారు. వీరి బాణీలకు హనుమాన్ మాలధారణ స్వాములు తన్మయత్వం చెంది నృత్యం చేశాడు. ఆలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ ప్రాంగణం రామనామంతో మార్మో గింది. ఈ కార్యక్రమానికి వంశీకృష్ణ రియల్ ఎస్టేట్ యజమానులు అన్న ప్రసాద వినియోగం చేశారు. ఆలయ ఈవో బైరాగి చౌదరి ఆధ్వర్యంలో చావా నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చావా నాగేశ్వరరావు మాట్లాడుతూ కలియుగంలో దైవ నామ స్మరణ ఒక్కటే ఆస్తి అని అన్నారు. ప్రతి ఒక్కరూ కేశవ నామము స్మరించాలని అన్నారు. దైవ నామ స్మరణ వల్ల మంచి కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలధారణ స్వాములు, గోవింద స్వాములు, శివ స్వాములు, అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi