Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వినికిడి సమస్య లేని కందుకూరు నియోజక వర్గం కోసం కృషి చేస్తున్నాం ..నళినీ దేవి. కందుకూరు, అమరావతి జ్యోతి: వినికిడి సమస్య లేని కందుకూరు నియోజకవర్గం కోసం గాను రామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాము శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు రామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ ఉన్నం. నళినీ దేవి గురువారం తెలిపారు. తాను చైర్మన్ గా ఉన్న ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని ఆమె వెల్లడించారు కందుకూరు నియోజకవర్గానికి వినికిడి సమస్య లేని నియోజక వర్గం వలె తీర్చి దిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు నళినీ దేవి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కందుకూరు నియోజక వర్గ పరిధి లోగల గ్రామాలలోని ప్రజల నుంచి వినికిడి సమస్య గల వారి నుంచి దరఖాస్తులను కోరగా సుమారు 150 దరఖాస్తులు వచ్చాయనీ ఆమె అన్నారు. వినికిడి యంత్రాల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 150 మంది దరఖాస్తు దారులు డిసెంబర్ 2 వ తేదీ ఉదయం 9.30 గంటల కల్లా కందుకూరు పట్టణం లోని శ్రీ లక్ష్మీ తిరుమల కళ్యాణ మంటపం వద్దకు తప్పకుండా రావాలని ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు దారులకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే +91 85220 37395 ను సంప్రదించాలని నళినీ దేవి కోరారు. వైద్య పరీక్షల అనంతరం వినికిడి లోపం ఉన్న ప్రతి ఒక్క దరఖాస్తు దారునికి నిపుణులు సూచించిన వినికిడి యంత్రాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని రామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ ఉన్నం నళినీ దేవి గురువారం తెలిపారు.
Admin
Amaravathi Jyothi