Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి వలేటివారిపాలెం ,అమరావతి జ్యోతి: పుణ్యక్షేత్రమైన మాలకొండలోని మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామిని హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అనంతరం స్వామి ప్రసాదాలను ఆలయ ఈవో కేబి శ్రీనివాసరావు పూజారి అందించారు. స్వామిని చూసి తరించేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తజనం తరలివచ్చారు. ఆలయ అర్చకులు లక్ష్మీ నరసింహ స్వామిని, లక్ష్మీదేవి అమ్మవారిని పూలాంకరణ చేసి పలు రకాల పూజలను నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్టును భక్తులు దర్శించి కష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించాలని వేడుకొన్నారు. శనివారం ఒక్కరోజు ఆలయానికి వివిధ రూపాల్లో రూ.8,29,197 లు ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈ వో కే బి శ్రీనివాసరావు తెలిపారు.
Admin
Amaravathi Jyothi