Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మాలకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో దర్శనం టిక్కెట్లు పెంపు,తదితర మార్పులపై ప్రజలలో గందరగోళం నెలకొనడంతో ఈ విషయంపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం స్పందించారు.ఆయన మాట్లాడుతూ..ప్రసిద్ధ క్షేత్రమైన మాలకొండ దేవాలయంలో చేపట్టే ఏ అభివృద్ధి కార్యక్రమమైనా, మార్పులైనా భక్తుల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న తర్వాతే అమలు చేస్తామని స్పష్టం చేశారు.ఈ విషయంపై నియోజకవర్గ బిజెపి ముఖ్య నాయకులు ఉన్నం భాస్కరరావు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న ఆయన.. పేద, బడుగు,బలహీన వర్గాలను,హిందూ సంప్రదాయాలను,భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే స్పందించి తీసుకున్న నిర్ణయం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Admin
Amaravathi Jyothi