Monday, 15 June 2026 03:49:06 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయి

Date : 30 May 2024 02:42 PM Views : 817

Amaravathi Jyothi - Andhra Pradesh / అమరావతి : అమరావతి:*ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్‌ తీసుకుంటే ఎక్కువ ప్లేస్‌మెంట్స్‌ ఉంటాయి?* *ప్రస్తుతం డిమాండ్‌ ఉన్న కోర్సులేంటి?* కెరీర్‌ పరంగా ఏ బ్రాంచ్‌కి ఇప్పుడు ఎక్కువ డిమాండ్‌ ఉంది వంటి వివరాలపై JNTUH ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ.. @ ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌ ఎంచుకునేటప్పుడు వాటికున్న డిమాండ్‌, ప్లేస్‌మెంట్స్‌ కూడా ముఖ్యం. ప్రస్తుతం ఏ బ్రాంచ్‌ నుంచి ఎక్కువగా ప్లేస్‌మెంట్స్‌ వస్తున్నాయి? గత 5-10 ఏళ్లుగా CSE బ్రాంచ్‌కే ఎక్కువ ప్లేస్‌మెంట్స్‌ వస్తున్నాయి. అయితే కోర్‌ బ్రాంచ్‌లకు మంచి ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్స్‌ వస్తున్నాయి. దేని ప్రాధాన్యత దానిదే. @ JNTUHలో ప్లేస్‌మెంట్స్‌ ఎలా వస్తున్నాయి? ఏ బ్రాంచ్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం దక్కించుకుంటున్నారు? కాలేజీలో CSE బ్రాంచ్‌కి దాదాపు 90 శాతం ప్లేస్‌మెంట్స్‌ వచ్చాయి. మొత్తం కాలేజీ పరంగా 60 శాతం ప్లేస్‌మెంట్స్‌ వస్తుంటాయి. గతేడాది దాదాపు 80 కంపెనీలు వచ్చాయి. యావరేజ్‌ గా 5-6 లక్షల ప్యాకేజీతో స్టూడెంట్స్‌ ప్లేస్‌ అవుతున్నారు. @ సాధారణంగా విద్యార్థులకు ఏ ఏడాదిలో ప్లేస్‌మెంట్స్‌ ఛాన్స్‌ దక్కుతుంది? దాదాపుగా నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్‌ నుంచి కంపెనీలు రావడం మొదలుపెడతాయి. సెలక్ట్‌ అయిన విద్యార్థులకు వాళ్లే ట్రైనింగ్‌ ఇస్తారు. @ సాఫ్ట్‌వేర్‌ సంబంధిత కంపెనీలు వస్తుంటాయా? లేద కోర్‌ కంపెనీలు కూడా వస్తుంటాయా? రెండూ. ఇప్పుడున్న ట్రెండ్స్‌ ప్రకారం కేవలం కంప్యూటర్‌ ఆధారిత ఉద్యోగాలకే డిమాండ్‌ అనుకోవడం అపోహ మాత్రమే. కోర్‌ కంపెనీలు కూడా భారీ జీతంతో రిక్రూట్‌ చేసుకుంటాయి. @ ఇంతకుముందు CSE కి సమానంగా ECE కి కూడా డిమాండ్‌ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడంతా CSE వైపే ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. కారణం? ECE కోర్‌ సబ్జెక్ట్స్‌ అయిన VLSI వంటి వాటిపై గ్రోత్‌ ఉంది కానీ ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. అందుకే కంప్యూటర్‌ కోర్సుల వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. @ కోర్‌ బ్రాంచెస్‌ అయిన సివిల్‌, మెకానికల్‌, ఈఈఈ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? వీళ్లకు దాదాపు 60 శాతానికి పైగా ఉ‍ద్యోగ అవకాశాలు ఉంటున్నాయి. ఇంతకుముందు స్టూడెంట్‌ మెటలర్జీ విద్యార్థికి 13 లక్షల అత్యధిక వేతనంతో ప్లేస్‌మెంట్‌ లో కొలువు సంపాదించింది. @ ఇంజనీరింగ్‌ పూర్తవగానే చేతిలో ఉద్యోగం ఉండాలి అని భావించేవాళ్లు ఎలాంటి స్కిల్స్‌ డెవలప్‌ చేసుకుంటే మంచిది? కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో చాలా మంచి పట్టుండాలి. టెక్నికల్‌ స్కిల్స్‌ బాగా తెలుసుండాలి. ఏ బ్రాంచ్‌కి చెందిన వాళ్లు అయినా కనీసం 1-2 కోర్‌ సబ్జెక్ట్స్‌లో మంచి నైపుణ్యం ఉండాలి. ఫైనల్‌ ఇయర్‌లో చేసే ప్రాజెక్ట్స్‌ కూడా చాలా ముఖ్యం. ఇండస్ట్రీకి అవసరమైన ప్రాజెక్ట్స్‌ తీసుకోవాలి. ఈ అంశాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ.....మీ PAAP అధికారిక వెబ్‌సైట్ https://www.rgukt.ac.in/

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :