Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు నియోజకవర్గ ప్రజలు తుఫాన్ పట్ల జాగ్రత్తలు పాటించండి ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి తుఫాన్ పట్ల జాగ్రత్తలు పాటించాలని. సూచించారు. పూరి గుడిసెలలో నివసించేవారు అధికారులు సూచించిన భవనములోకి రావాలని. అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని. అధికారుల సలహాలనుఎప్పటికప్పుడు పాటించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుఫాన్ ప్రాంతలకు నిధులు విడుదల చేశారని, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నారని ఆయన అన్నారు. వ్యవసాయ రంగానికి నష్టం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజలు వాగులు, వంకలు, దాటి ప్రయాణించేటప్పుడు పోలీసుల వారి సూచనలు తీసుకోవాలని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తుఫాన్ ప్రాంతాలలో సహాయ చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.
Admin
Amaravathi Jyothi