Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : (కందుకూరు,అమరావతి జ్యోతి: రానున్న ఎన్నికల్లో కందుకూరు నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా.మధుసూధన్ యాదవ్, నెల్లూరు ఎం.పి.అభ్యర్ధి. వేనంబాకం.విజయ సాయి రెడ్డి లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం కందుకూరు పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల సమయం కావడంతో అభ్యర్థుల ప్రకటనకు ముందు ఈ ఎన్నికల్లో కందకూరు నుంచి బీసీలకు అవకాశం ఇద్దామనే విషయం మానుగుంట మహీధర్ రెడ్డి అన్నకు చెబితే ఒక్క మాట కూడా ఆలోచించకుండా, వెనుకడుగు వేయకుండా నువ్వు అడిగావు.. నేను చేసిపెడతా అని.మహీధర రెడ్డి అన్న చెప్పారని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి మంచి మనసున్న మహీధర్ రెడ్డి అన్నను నిజంగా గుండెల్లో పెట్టుకుంటానని మీ అందరి సాక్షిగా చెబుతున్నాను. రానున్న.ఎన్నికల్లో మన ప్రభుత్వం అధికారం లోకి రాగానే మీ అభిమాన నాయకుడు మహిదరన్నకు ఎమ్మెల్సీ ఇచ్చి మహీధర్ అన్నను చట్ట సభల్లో కూర్చొనేలా చేస్తామని సి.ఎం.జగన్ మోహన్ రెడ్డి సభలో ప్రకటించారు. కార్యకర్తలు హర్షధ్వానాలు మధ్య కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజక వర్గం పరిధి లోని 5మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi