Amaravathi Jyothi - Andhra Pradesh / Nandyal : నంద్యాల: కాపు,బలిజ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థినీ విద్యార్థులలో మెరికల లాంటి ఆణిముత్యాల ప్రతిభా వంతులను గుర్తించి ప్రతిభకు పట్టాభిషేకం పేరిట ఆంధ్ర ప్రదేశ్ కాత్వా (కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్) ఆద్వర్యంలో నంద్యాల పట్టణంలో చేపట్టడం హర్షించ దగిన విషయమని శాంతారాం విద్యా సంస్థల అధినేత, కార్యక్రమ ముఖ్య అతిథి మిద్దె శాంతారాం అన్నారు. ఆదివారం ఉదయం నంద్యాల పట్టణం లోని గోపిశెట్టి పద్మావతి కళ్యాణ మండపం నందు ఏ.పి.కాత్వా ఆద్వర్యంలో కాపు, బలిజ సామాజిక వర్గానికి చెందిన చిన్నారులకు ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాత్వా రాష్ట్ర అధ్యక్షుడు లీలా మాధవ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మిద్దె శాంతి రామ్ మాట్లాడుతూ సమాజం యావత్తూ బాగుపడాలంటే గురువు అనే వారు ఎంతో ముఖ్యమని, అటువంటి గురువులు వాస్తవానికి దేవుని కంటే ఎంతో గొప్ప వారన్నారు. నేడు వ్యవసాయ రంగం నుంచి శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న విప్లవాత్మక మైన మార్పులకు నాంది విద్యా బుద్దులు నేర్పిన గురువు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. అటువంటి స్థానంలో ఉన్న గురువులు నేడు కాపు బలిజ సామాజిక సేవా సంఘం ద్వారా ప్రతిభా విద్యార్థులను గుర్తించి వారికి అభినందనలతో పాటు ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున పారితోషికం ఇవ్వడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాపుల ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, దక్షిణ భారత దేశంలో ఒక మంచి గుర్తింపును తెచ్చే విధంగా కృషి చేస్తున్న టి.బి.కే రాష్ర్ట అధ్యక్షులు దాసరి రాము కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాత్వా ఆద్వర్యంలో జరుగుతున్న *ప్రతిభకు పట్టాభిషేకం* కార్యక్రమానికి ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అవసరమైన "కాపు,బలిజ సంక్షేమ సంఘం కార్పరస్ ఫండ్" కోసం శాంతి రామ్ విద్యా సంస్థల అధినేత మిద్దె శాంతి రామ్ రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ కాపు బలిజ సంక్షేమ కార్పరస్ ఫండ్ కోసం రెండు కోట్ల రూపాయల మేరకు నిధులను సమీకరించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా శాంతి రామ్ కు కాత్వా వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్లా నారాయణ రావు హృదయ పూర్వక ధన్యవాదములు తెలియ జేశారు. మరొక అతిథి,టి.బి.కే రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రాము తన సుదీర్ఘ ఉపన్యాసంలో టీచర్ల ఔన్నత్యాన్ని చాటి చెబుతూ ప్రసంగించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాపు,బలిజ, ఒంటరి, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఏ మేరకు అయితే రాష్ట్రంలో భాగస్వాములుగా ఉన్నారో నేడు ప్రతిభా వంతులైన విద్యార్థులు అదే విధంగా ఉండటం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాత్వా సంఘం ఇటీవల కాలంలో పార్టీలకు అతీతంగా అందరూ మనస్ఫూర్తిగా తమకు సహకరించి జన సేన పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులను నూరు శాతం విజయం సాధించడంతో పాటు, ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారం లోకి రావడానికి కృషి చేసిన కాత్వా సంఘానికి, ఆ సంఘీయుల కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు దాసరి రాము అభినందనలు తెలిపారు. అనంతరం కాత్వా రాష్ట్ర అధ్యక్షుడు లీలా మాధవ రావు మాట్లాడుతూ కాత్వా సంఘ సేవలను సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తి అయిందని, నంద్యాల పట్టణంలో సంఘం తరుపున ద్వితీయ కార్యక్రమం లో భాగంగా ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మరొక అతిథి, కాత్వా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ ఉపాద్యాయులు కొల్లా నారాయణ రావు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరుపున గత ఏడాది శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో కార్యక్రమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రతిభా పురష్కారాలతో పాటుగా గ్రూపు - 1, 2 లలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి ఉన్నత స్థాయి ఉద్యోగాలను పొందిన కాపు యువతీ యువకులకు ఘన సన్మానం నిర్వహించి పారితోషికాలు అందించామని అన్నారు. రెండో వార్షికోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమానికి రెట్టింపు ఉత్సాహంతో ప్రతిభా వంతులు, ఉపాద్యాయులు, కాపు బలిజ సామాజిక సంఘీయులు అధిక సంఖ్యలో హాజరు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా అనేక మంది కాపు టీచర్లు, కాపు సంఘీయులు తమ ప్రసంగాలలో విలువైన సమాచారాన్ని అందించడం తోబాటు, భవిష్యత్ లో ఇంకా ఉన్నతమైన స్థాయిని, స్థానాన్ని పొందేందుకు తీసుకోవాల్సిన అవసరమైన జాగ్రత్తలను వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ.సాయి కూచిపూడి నాట్య మండలి ఫైన్ ఆర్ట్స్ నిర్వాహకులు డాక్టర్ పల్లెంశెట్టి. సురేష్ శిష్య బృందం ఆద్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన సభికులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శాంతి రామ్, విశిష్ఠ అతిథిగా హాజరైన దాసరి రాము, డిప్యూటీ సి.ఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఆడిటర్ గా పని చేస్తున్న బి.శ్రీకాంత్ తో పాటు పలువురు ప్రత్యేక ఆహ్వానితులను కాత్వా సంఘం తరుపున సంఘం నేతలు కొల్లా నారాయణ రావు, ఫణీంద్ర కుమార్, లీలా మాధవ రావు, గోపిశెట్టి. బంగారు రాజు, పోతంశెట్టి రమేష్ నాయుడు, కమతం సుబ్బారావు, పగడాల శ్రీనివాసరావు తదితరుల ఆద్వర్యంలో ఘనంగా సత్కరించారు. సమావేశం ప్రారంభానికి ముందు ముఖ్య అతిథులను,విశిష్ఠ,ప్రత్యేక అతిథులను కాత్వా సంఘం తరుపున పూర్ణ కుంభంతో మంగళ వాయిద్యాల నడుమ స్టేజి మీదకు ఘనంగా ఆహ్వానించారు. ప్రసంగాల తదుపరి భోజనానంతరం కాపు, బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రతిభా వంతులైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలలో భాగంగా 10 వేల రూపాయల నగదు, ప్రశంసా పత్రాలను విద్యార్థుల తల్లి దండ్రులు, బంధు మిత్రులు,కాత్వా కుటుంబ సభ్యుల హర్ష ధ్వానాలు,అభినందన మందారమాలల మధ్య ... పైగా ప్రతిభా వంతులైన విద్యార్థులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కాత్వా సంఘం వ్యవస్థాపకులు కొల్లా నారాయణ రావు,వ్యవస్థాపక అధ్యక్షుడు పేరూరి.ఫణీంద్ర కుమార్, ప్రస్తుత కాత్వా అధ్యక్షుడు లీలా మాధవ రావు,ప్రధాన కార్యదర్శి గోపి శెట్టి.బంగారు రాజు, ఆర్థిక కార్యదర్శి పోతంశెట్టి. రమేష్ నాయుడు, కమిటీ చైర్మన్ చెన్నకేశవుల రమేష్, కమిటీ ఉపాధ్యక్షులు కమతం. సుబ్బారావు,మిఠాయి వేణు గోపాల్, క్రమశిక్షణా కమిటీ చైర్మన్ స్వామి, ప్రముఖ న్యాయవాది గోపిశెట్టి ప్రసాద రావు, నంద్యాల జిల్లా కాత్వా సంఘం నాయకులు పగడాల శ్రీనివాసరావు, నంది అవార్డు గ్రహీత పత్తి ఓబులయ్య, అడగాల.సుబ్రమణ్యం లతో పాటు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన 500 మందికి పైగా టీచర్లు, విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు, కాపు, బలిజ సంఘియులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi