Monday, 15 June 2026 03:50:52 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

అన్ని రకాల సహకార సంఘాలను పటిష్ట పరిచేందుకు కృషి: కలెక్టర్ ఆనంద్

Date : 05 November 2024 10:12 PM Views : 802

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జిల్లాలో అన్ని రకాల సహకార సంఘాలను పటిష్ట పరచి వాటి బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజలకు మంచి సేవలు అందించుటకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని ఎస్‌ ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నాల్గవ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రైవేటు బ్యాంకుల తరహాలో రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లాలో సహకార సంఘాల ఆధునీకరణ, డిజిటలైజేషన్‌కు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆప్కాబ్‌ సహకారంతో జిల్లాలోని 78 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలోని రికార్డులు కంప్యూటరీకరణ పూర్తిదశకు వచ్చిందన్నారు. పిఎసిఎస్‌ల కంప్యూటరీకరణ వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, ఆన్‌లైన్‌ సేవలకు, కోర్‌ బ్యాంకింగ్‌ సేవలకు అనుసంధానించబడి సభ్యులకు సత్వర సేవలు అందుతాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో నెల్లూరు డిసిసి బ్యాంకు, ప్రకాశం జిల్లా డిసిసి బ్యాంకునకు అనుసంధానించబడిన 61 పిఎసిఎస్‌ సంఘాలలో క్రియాశీలక సభ్యుల రుణాలు, డిపాజిట్లు, భూమి వివరాలు 87.99శాతం కంప్యూటరీకరణ పూర్తి అయినట్లు చెప్పారు. ప్రపంచ వికేంద్రీకత ఆహార భద్రతా పథకం కింద పడుగుపాడు పిఎసిఎస్‌కు అతిపెద్ద ధాన్యం నిల్వ కేంద్రం మంజూరైనట్లు, ఈ కేంద్రం ద్వారా బహుళ ప్రయోజన సేవలు రైతులకు లభించనున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. నాబార్డు సహకారంతో జిల్లాలో కొత్తగా బహుళ ప్రయోజన పిఎసిఎస్‌ సంఘాలు, మత్స్యకారుల సంఘాలు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు స్థాపించుటకు జాయింట్‌ కలెక్టరు అధ్యక్షతన జాయింట్‌ వర్కింగ్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో సహకార సంఘాల బలోపేతానికి కమిటీ సభ్యులు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సహకారశాఖ అధికారి గుర్రప్ప, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ అధికారి రమేష్‌నాయక్‌,నాబార్డ్ AGM తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :