Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం లింగసముద్రం, అమరావతి జ్యోతి: లింగసముద్రం గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంతంలో బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ *ఇంటూరి నాగేశ్వరరావు* మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ... సంపూర్ణ మధ్యపాన నిషేధం, ప్రత్యేక హోదా, అమరావతి, 45 సంవత్సరాలకే పింఛన్, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ , ఇంకా అనేక హామీలను నెరవేర్చలేక మోసం చేశారని నాగేశ్వరరావు స్థానికులకు వివరించారు... వెనుకబడిన లింగసముద్రం మండలంలో అభివృద్ధి మొత్తం నిలిచిపోయింది. రాష్ట్ర పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేసి, పంచాయతీలలో జరగవలసిన అభివృద్ధి నిధులను దారికి మళ్లించి, కనీసం పారిశుద్ధ్యం, వీధి దీపాలు నిర్వహణకు డబ్బులు లేకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఇంకోసారి ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని, ఈసారి జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని నాగేశ్వరరావు కోరారు తెలుగుదేశం ప్రభుత్వం లో మాత్రమే మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగాయి. రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం అవసరం ఎంతో ఉంది. తెలుగుదేశం ,జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసిమెలిసి పనిచేసే రాబోయే ఎన్నికల్లో జెండాలు ఎగరేద్దాం - *ఇంటూరి నాగేశ్వరరావు* ఈ సందర్భంగా పలువురు జగన్మోహన్ రెడ్డి పాలనలో పెరిగిన చార్జీలు, ధరలతో కుటుంబాలను పోషించుకోవడం ఇబ్బందిగా ఉందని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసేది లేదని స్పష్టం చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు వేముల గోపాలరావు, జనసేన మండల కన్వీనర్ అంగులూరి నరసింహరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గాలంకి ప్రసాద్ మండల ప్రధాన కార్యదర్శి పూరిమిట్ల మాల్యాద్రి, మండల తెలుగు యువత అధ్యక్షులు అడపా రంగయ్య, విశ్వనాధపురం సర్పంచ్ బొల్లినేని నాగేశ్వరరావు, మండల తెలుగు రైతు అధ్యక్షులు మద్దెల రామారావు, నాయకులు అడపా నరసయ్య, బింకం శేషయ్య, అర్దాకుల పెద్ద సత్యం, దేవకి సుబ్రహ్మణ్యం మక్కెన మల్లికార్జున చిరుతోటి బాలకోటయ్య, జంపాల కృష్ణయ్య, జంపాల శివ, బ్రహ్మారెడ్డి, పెద్దిరెడ్డి, నాగిరెడ్డి, నాగిరెడ్డి, కిలారి రమణయ్య, కిలారి కొండయ్య, గొల్లపల్లి వెంకటేశ్వర్లు, రవీంద్ర, సోంపల్లి మనోహర్, ముళ్లపాటి మహేష్, కిలారి యశ్వంత్, ముసలయ్య, గొర్రెపాటి సాంబయ్య, మోతుకూరి పర్వతాలు, ముప్పరాజు వెంకటేశ్వర్లు, ఉన్నం వీరాస్వామి, మాల్యాద్రి, బండ్లమూడి రామయ్య, ఉట్లపల్లి మాధవరావు, నారిబోయిన నారాయణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు...
Admin
Amaravathi Jyothi