Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు :ఎమ్ ఎస్ ఎం ఈ సర్వేను ఎండిఓ వెంకటేశ్వరరావు శుక్రవారం మండలంలోని మోచర్ల , గుడ్లూరు పూరేటిపల్లి గ్రామాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. ఈ సర్వేలోఎనిమిది అంశాలపై సర్వే చేస్తారని సంబంధిత వ్యాపార యజమానులు అందించే వివరాలను యాప్ ద్వారా నమోదు చేస్తారు. వ్యాపార యజమాని ఎవరు? ఎంత పెట్టుబడితో పెట్టారు? వ్యాపారం ఎలా ఉంది? సిబ్బంది కొరత ఏమైనా ఉందా? కొత్త సాంకేతికత వినియోగిస్తున్నారా? సిబ్బందికి శిక్షణ అవసరమా? బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సరుకు ఎవరికి ఎగుమతి చేస్తారు? ట్రేడింగ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? తదితర అంశాలపై సర్వే చేస్తారు. ఈ సర్వే ఆధారంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ద్వారా ఎటువంటి సహాయం కోరుతున్నారో గుర్తించి వాటిని అందించి వ్యాపారాభివృద్ధికి సహకరించే విధంగా ఈ సర్వే ఉపయోగ పడుతుందని ఆయన చెప్పారు. పలు షాపులకు వెళ్ళి సర్వే తీరుని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మార్టిన్, అనూష గృహ నిర్మాణ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi