Amaravathi Jyothi - Andhra Pradesh / Anakapally : వలేటివారి పాలెం: మండలంలోని సింగమనేనిపల్లి గ్రామ వాస్తవ్యులయిన గంగోలు నాగరాజ్యం కుమార్తెకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నది . ఆమె గర్భవతి కావడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది . నాగరాజ్యం భర్త చాలాకాలం క్రితం మరణించారు. తన కొడుకుకి ఆక్సిడెంట్ లొ కాలు దెబ్బతిన్నది . రెండో కుమారుడికి కూడా కరెంట్ షాక్ వల్ల కాలి వేళ్ళు తీసేశారు . ఆసరా కోసం ఎదురు చూస్తున్న కుటుంబాన్ని స్థానిక వ్యక్తుల ద్వారా తెలుసుకున్న సేవాసదన్ వ్యవస్తాపకులు ,అధ్యక్షులు అయిన నాగిశెట్టి మాల్యాద్రి ,రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి,విజయనగరం జిల్లా అధ్యక్షులు నాగసూర్య శర్మను సంప్రదించి హుటాహుటిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కట్టా ఏసునాధంతో కలిసి కుటుంబానికి గ్రామస్తుల సమక్షంలో ఆరు వేల రూపాయల నగదును ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగినది . ప్రతినెలా సేవా సదన్ రాష్ట్రం లోని ఏదో ఒక మూల సాయం చేస్తున్నదని ఆపదలో ఉన్న వారిని సంస్థ తరుపున ఆదుకోవడమే తమ లక్ష్యమని అధ్యక్షులు మాల్యాద్రి తెలిపారు.సేవాసదన్ కార్యక్రమాలకు నెల నెలా సహాయం అందిస్తూ సేవలో దైవత్వాన్ని చూసుకుంటూ సహకరిస్తున్న సేవాసదన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు . సేవా సదన్ చేస్తున్న సహాయ కార్యక్రమాలను గ్రామస్తులు అభినందించారు .
Admin
Amaravathi Jyothi