Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు. దుత్తలూరు అమరావతి జ్యోతి: దుత్తలూరు మండలం దుత్తలూరు సంజీవ శిఖరం పై వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి నీ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయగిరి నియోజక వర్గం టిడిపి అభ్యర్థి కాకర్ల సురేష్ దర్శించు కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు ఆలయ లాంఛనాలు తో సత్కరించి కాకర్ల సురేష్ గోత్ర నామదేయాలతో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందచేశారు.ఈ సందర్భంగా ఉదయగిరి మాజీ శాసన సభ్యులు కంభం విజయ రామిరెడ్డి కాకర్ల సురేష్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో కాకర్ల సురేష్ ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి శ్రీకుర్తి.రవీంద్ర బాబు, మాజీ జడ్పీటిసి చీదర్ల మల్లికార్జున, ఉదయగిరి నియోజక వర్గ టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi