Monday, 15 June 2026 03:52:38 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

బీసీల సంక్షేమానికి సీఎం అధిక ప్రాధాన్యం

Date : 03 December 2023 09:59 AM Views : 261

Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : బీసీల సంక్షేమానికి సీఎం అధిక ప్రాధాన్యం. కడియం, అమరావతి జ్యోతి: రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. రాజమండ్రి రూరల్ వేమగిరి హైవే పక్కన 40 సెంట్ల స్థలంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించబోయే కమ్యూనిటీ హాల్ కు ఎంపీ భరత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో విలువైన ఈ స్థలాన్ని బీసీల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి కేటాయించడం హర్షణీయమన్నారు. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ రహదారి పక్కన స్థలం కేటాయించడం సాధారణ విషయం కాదని, రాష్ట్రంలోనే నేషనల్ హైవే పక్కన ఇంత పెద్ద కమ్యూనిటీ హాల్ ఇప్పటి వరకూ ఇదేనని‌ అన్నారు. మొదటి దశలో రూ.50 లక్షలతో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి, ప్రారంభోత్సవం కూడా వెనువెంటనే చేసుకునేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థికపరంగా బీసీల ఉన్నతిని కోరుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి మనమంతా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ‌బడుగు, బలహీన వర్గాల వారందరికీ ఈ కమ్యూనిటీ హాలు అన్ని విధాలుగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ స్థలానికి చేరువులోనే కాలువ ఉందని, ఆ కాలువపై వంతెన మాదిరిగా నిర్మిస్తే డైరెక్ట్ గా నేషనల్ హైవే పై నుంచి కల్యాణ మండపానికి రావడం చాలా సులభమని ఎంపీ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాస్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :