Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఉత్తమ పారిశ్రామిక వేత్త అవార్డు అందుకున్న చెన్నారెడ్డి శ్రీనివాసరావు గుడ్లూరు, అమరావతి జ్యోతి: ఉత్తమ అవుట్ స్టాండింగ్ పారిశ్రామికవేత్త అవార్డును కోస్టల్ డ్రగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ చెన్నారెడ్డి శ్రీనివాసరావు అందుకున్నారు. దేశవ్యాప్త అవార్డు ప్రదానోత్సవంలో కోయంబత్తూర్లో జరిగింది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ - ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మూడేళ్ల కిందట ప్రారంభించిన కోస్టల్ డ్రగ్స్ ఫార్మ ( మెడిసిన్ రా పౌడర్ తయారీ) వారు ఉత్తమ ప్రగతి సాధించారు. ఎపి నుంచి కోస్టల్ డ్రగ్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తమ వ్యాపారాన్ని అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లిన శ్రీనివాసరావు ఈ అవార్డుకి ఎంపికయ్యారు యువ ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఈ అవార్డు తనకు రావడం చాలా సంతోషంగా ఉందని ఈ అవార్డు ఇచ్చిన నూతనోత్తేజంతో రాబోవు కాలంలో మరింత ముందుకు తీసుకెళ్లి పరిశ్రమ అభివద్ధి పథంలో నడిపిస్తామని అవార్డు గ్రహీత కోస్టల్ డ్రగ్స్ డైరెక్టర్ చెన్నారెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. యువ పారిశ్రామికవేత్త అవార్డు అందుకున్న తమ కోస్టల్ డ్రగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ను సహచర మేనేజింగ్ డైరెక్టర్లు చెన్నుపాటి శ్రీనివాసరావు, కందుల ప్రభుకిరణ్ లతో పాటు గుడ్లూరుకు చెందిన బంధుమిత్రులు అభినందించారు.
Admin
Amaravathi Jyothi