Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మిచౌంగ్ తుఫాన్ పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి....ఎమ్మెల్యే కావలి, అమరావతి జ్యోతి : తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లా కి ఎక్కువ గా ఉండడం వల్ల అందులో కావలి సమీపాన తీరం దాటుతుందని సమాచారం అందడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వాను సైతం లెక్కచేయకుండా రూరల్ గ్రామాలు ,అల్లూరు ,బోగోలు,గ్రామాలు అధికారులతో కలిసితిరిగి వాతావరణo అలాగే అక్కడ తుఫాను కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.అక్కడ ఉన్ననాయకులను ,అధికారులను అప్రమత్తం చేశారు.ఎప్పటి కప్పుడు పరిస్థితులు తెలుసుకొని వారికి అండగా ఉండి పరిస్థితులను బట్టి సహాయ కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పారు.అందరూ దైర్యంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలిఅనిసూచించారు. మన పార్టీ నాయకులు.కార్యకర్తలు,సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు అండగా ఉండాలి అని సూచించారు. అక్కడ ఏమి ఐనా ఇబ్బందులు ఉంటే సదరు అధికారులకు నాయకులకు తెలియ చేసి సమస్య ను పరిష్కరించాలని తెలియజేశారు.
Admin
Amaravathi Jyothi