Monday, 15 June 2026 03:51:40 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

అంగన్వాడి సమస్యల పరిష్కారం కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ

Date : 24 December 2023 09:05 PM Views : 253

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కొవ్వొత్తులతో ప్రదర్శన. ఉలవపాడు, అమరావతి జ్యోతి: ఉలవపాడు మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడి పాఠశాల లబ్ధిదారులైన పిల్లలతో *జగన్ మామ అంగన్వాడి అమ్మల న్యాయమైన సమస్యలను పరిష్కరించండి* అని నినదీస్తూ కొవ్వొత్తులను వెలిగించి పట్టుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు జీవీబీ కుమార్ మాట్లాడుతూ 13 రోజుల నుండి అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధికంగా సమ్మె చేస్తున్నారని పేర్కొన్నారు. అంగన్వాడి పాఠశాలలు మూతపడటంతో మాకు గుడ్డు లేదు, భోజనం లేదు, ఆటపాటలు లేవని పిల్లలు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. జగన్ మామ మా అంగన్వాడీ అమ్మల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ప్రాజెక్టు లీడర్ సిహెచ్ ఇంద్రావతి, కార్యకర్తలు ఎస్ గీత, జే వసంత, నాగమణి, తిరుపతమ్మ, ప్రవీణ వెంకటరమణమ్మ, సుల్తాన్ బీ సుస్మిత, అంగన్వాడి పాఠశాల పిల్లలు నిషిత, లెహన్స్, లాస్య, చెర్రీ,మోక్షజ్ఞ, అఖిల్, జోషఫ్ ధనుష్ తదితరులు పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :