Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : పాకల వైసిపికి మరో డబుల్ షాక్ సింగరాయకొండ, అమరావతి జ్యోతి: : మండలంలోని పాకల గ్రామాల్లో వైసీపీకి రోజురోజుకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ పాకాల గ్రామంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు గొల్లమూడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు సత్య, స్వామి సమక్షంలో టీడీపీలో చేరగా అదే పరంపరను ఇప్పటివరకు విడతల వారీగా పాకల గ్రామం నుండి టిడిపిలో చేరుతున్నారు. ఇప్పటివరకు సుమారు ఒక్క పాకల పంచాయతీ నుండి ప్రదేశం పార్టీలోకి 500 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరడం మంచి పరిణామముని స్వామి అన్నారు. శనివారం తూర్పు నాయుడు పాలెం లోని ఎమ్మెల్యే అభ్యర్థి స్వామి నివాసంలో పాకల గ్రామం అంబేద్కర్ నగర్ కు చెందిన లింగంగుంట మాలకొండయ్య, తిరుపతి, బ్రహ్మానందం, కొండలు, ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, శివరామయ్య, బాలాజీ, మురళీమోహన్, శివకోటయ్య, మేకా శివకోటయ్య, కల్లూరి నాగరాజు తోపాటు వారికి సంబంధించిన 15 కుటుంబాల వారు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి స్వామి తెలుగుదేశం కండవాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, పాకల గ్రామానికి చెందిన నాయకులు హాజరయ్యారు.
Admin
Amaravathi Jyothi