Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : 17వ వార్డులో తెలుగుదేశం శంఖారావం కందుకూరు, అమరావతి జ్యోతి: తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు కందుకూరు పట్టణంలోని 17వ వార్డు బీసీ కాలనీలో శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించిన పార్టీ నాయకులు.కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ, టిడిపికి మద్దతు కోరిన కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు సతీమణి ఇంటూరి సౌజన్య . కాలనీలోకి వచ్చిన ఇంటూరి సౌజన్యకి స్థానికులు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా బాబు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఆమె ముందుకు సాగారు. మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ అని, గతంలో మహిళలు స్వయం ఉపాధి పొందే విధంగా చంద్రబాబు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారని సౌజన్య గారు అన్నారు. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా, బీసీలైతే 50 ఏళ్ల వారికి పింఛన్ ఇస్తారని అన్నారు. అలాగే ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, ప్రతినెలా మహిళకు 1500 ఆర్థిక సాయం, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే, అందరికీ అమ్మకు వందనం పేరుతో 15 వేల చొప్పున అందజేస్తారని వివరించారు. ఇప్పటికే ఈ పథకాలు అన్ని వర్గాలకు చేరువయ్యాయని అన్నారు. కందుకూరు నియోజకవర్గంలో ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల అభిమానం సంపాదించుకున్నారని, కార్యకర్తల్లో మనోధైర్యం నింపారని ఆమె తెలిపారు. అలాంటి వ్యక్తిని గెలిపించి అసెంబ్లీకి పంపితే సమస్యలపై ప్రజల గొంతు వినిపిస్తారని, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని వివరించారు. రాబోయే ఎన్నికల్లో నాగేశ్వరరావుకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు దివి శ్రీనివాసరావు, స్థానికులు యనమల రాజేశ్వరి, తన్నీరు లక్ష్మి, సుగుణ, మరియమ్మ, కత్తి ఆశీర్వాదం, కత్తి జయరావు, పరుసు రఘు, గుమ్మడి శివ, గళ్ళ రమణయ్యతోపాటు పట్టణ మహిళా అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీరాజ్యం, ప్రధాన కార్యదర్శి కల్లూరి శైలజ, స్థానిక నాయకులు రాయి వెంకటేశ్వర్లు, పిడికిటి రఘునాధరావు, కాకుమాని మాల్యాద్రి, అమరా రామలింగయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi