Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చిన ఇంటూరి నాగేశ్వరరావు వలేటివారిపాలెం అమరావతి జ్యోతి: మండలంలోని కలవళ్ళ గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించాలన్న గ్రామస్తుల అభ్యర్థనతో. కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు తనవంతుగా 2,01,116/- విరాళాన్ని శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు మన్నం అయ్యప్ప నాయుడు, స్వర్ణ మాధవరావు, పచ్చవ శ్రీనివాసులు, గౌరనేని సత్యనారాయణ, మోదేపల్లి రామదాసు, అబ్బూరి రమేష్, స్వర్ణ వినోద్, అబ్బూరి సతీష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi