Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు అభివృద్ధి కోసం కలసిరండి నియంత పాలనలో నష్టపోయింది చాలు చంద్రన్న పాలనే మనందరికీ శరణ్యం తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు, అమరావతి జ్యోతి: హైదరాబాద్ లో వేలాదిమందితో ఆత్మీయ సమ్మేళనం ఒక నియంత పాలనలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో కళ్ళారా చూస్తున్నాం. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే కాక ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితిని కల్పించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడగలిగేది చంద్రబాబు నాయుడు విజనరీ మాత్రమే. మీరంతా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరచండి. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవ్వండి... అని కందుకూరు నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో స్థిరపడ్డ నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఓటర్ల ఆత్మీయ సమ్మేళన సమావేశం.... టిడిపి కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో, హైదరాబాద్ మియాపూర్ లోని నెరైన్ గార్డెన్స్ లో శనివారం రాత్రి జరిగింది. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు , ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ , ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇంకా పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన కందుకూరు నుంచి హైదరాబాద్ కు వలసవచ్చి ఎన్నో కష్టాలు పడుతూ కొన్ని వేలమంది బతుకుతున్నారు. అదే మన ప్రాంతంలో ఉపాధి, ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉండి ఉంటే ఇంత దూరం వచ్చే వాళ్ళు కాదు. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఎన్నో కలలు కన్నారు. కానీ ఒక్క ఛాన్స్ అన్న మాయలో పడి మోసపోయాం. రాజధాని ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడంతో వలసలు వెళ్లక తప్పడం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రజల చూపంతా చంద్రబాబు వైపే ఉంది. ఆయన వస్తే మళ్లీ పరిశ్రమలు వస్తాయని, బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని జనం ఆశతో ఎదురుచూస్తున్నారు. అందుకోసం మీరంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రామాయపట్నం పోర్టు చుట్టుపక్కల వేలాది ఎకరాలను తన అల్లుడికి దోచి పెట్టేందుకు విజయసాయిరెడ్డి ప్లాన్ వేసి, కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిసేలా కుట్ర చేశారు. అలాగే వైసిపి ఐదేళ్ల పాలనలో కందుకూరును అభివృద్ధి చేయలేకపోయారు. నాకు చిన్న వయసులోనే చంద్రబాబు , లోకేష్ కందుకూరు బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఈ రెండేళ్లు నాకు సహాయ సహకారాలు అందించినట్లుగానే రాబోయే ఎన్నికల్లో నా గెలుపుకు సహకరించండి. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఇద్దరం కలిసి కందుకూరు నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడమే కాకుండా.. ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాం. హైదరాబాదులో స్థిరపడ్డ కందుకూరు నియోజకవర్గానికి చెందిన వ్యాపారులు, ఉద్యోగులు, ఇంకా వివిధ రంగాలలో ఉన్నవారు... ఈ నెల రోజులు బాధ్యత తీసుకొని తమ గ్రామాలలో పార్టీ గెలిచేలా కష్టపడాలని పిలుపునిస్తున్నాను. ఈ సమావేశంలో కందుకూరు నియోజకవర్గానికి చెందిన వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. ఇంటూరి నాగేశ్వరరావు నాయకత్వానికి జై కొడుతూ నినాదాలతో హోరెత్తించారు.
Admin
Amaravathi Jyothi