Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలో బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం.. కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు పట్టణంలో బాబు షూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం 24, 25 వార్డుల పరిధిలోని ఎర్రవడ్డిపాలెం, గుర్రంవారిపాలెం ఉత్తరం వైపు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు విస్తృత ప్రచారం నిర్వహించారు.టిడిపి మినీమేనిఫెస్టో వివరిస్తూ... కరపత్రాలు, షూరిటీ బాండ్లను స్థానికులకు అందజేసిన పార్టీ నాయకులు.ప్రధానంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నాగేశ్వరరావు వెంట నడుస్తూ, ఇంటింటికి వెళ్లి పథకాలపై అవగాహన కల్పించారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో, కందుకూరు పట్టణంలోని వివిధ వర్గాల ప్రజలకు ఎలాంటి పాలన అందిస్తామో వివరిస్తూ, సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చిన ఇంటూరి నాగేశ్వరరావు. అలాగే నాలుగున్నరేళ్ళ వైసిపి పాలనలో, పట్టణంలో జరిగిన అవినీతి అక్రమాలు, ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను స్థానికులకు నాగేశ్వరరావు గుర్తుచేశారు. వాటిలో ఎన్ని హామీలు నెరవేర్చారో అడుగుతూ, ఈసారి ఓట్ల కోసం వచ్చే ఎమ్మెల్యేను నిలదీయాలని ఆయన సూచించారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే, రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుందని, ముఖ్యంగా అనేక వర్గాల ప్రజలు ముందుగానే భయపడి పోతున్నారని నాగేశ్వరరావు తెలిపారు . రాష్ట్రంలోనూ, ఇక్కడ కందుకూరులోనూ ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. విద్యావంతులు, తటస్తులు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి, తోటి వారికి పరిస్థితి వివరించి, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు అధ్యక్షులు మదిరి మధు, గుర్రం మాల్యాద్రి, శ్రీపతి మురళీకృష్ణ,పి.బీమా, మదిరి వెంకటేశ్వర్లు, షేక్ ఖాజావలి, వీరబ్రహ్మం, కొండలరావు, బ్రహ్మయ్య, శీను, నరసింహ, గుర్రం మల్లికార్జున, కిషోర్, శంకర్, మురకొండ రామారావు, నవులూరి కొండయ్య, అబ్బూరి ప్రసాద్, పెంట్రాల సుబ్బారావు, చిట్టాబత్తిని మాలకొండయ్య, నాయకులు నాయకులు చిలకపాటి మధుబాబు, షేక్ రఫీ, వడ్డెళ్ల రవిచంద్ర, షేక్ మున్నా, చుండూరి శీను, షేక్ సలాం, సయ్యద్ జియావుద్దీన్, ఫిరోజ్, గౌస్ బాషా, కరిముల్లా, ముచ్చు వేణు, పులి నాగరాజు, ఫాజిల్, చంటి, బద్దిపూడి శిఖామణి, మమ్ముషా, వేముల ప్రసాద్, ముప్పవరపు వేణు, గుమ్మ శివ, మచ్చ మనోహర్, ముచ్చు రాజ్యలక్ష్మి, కల్లూరి శైలజ, తొట్టెంపూడి అశ్విని సుధారాణి, రత్తమ్మ, శ్రీదేవి, మల్లవరపు సీత మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi