Monday, 15 June 2026 03:46:51 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

వైసిపి మేనిఫెస్టో అట్టర్ ప్లాప్: స్వామి

Date : 28 April 2024 07:41 PM Views : 706

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : వైసీపీ మేనిఫెస్టో అట్టర్ ప్లాప్ : ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జరుగుమల్లి, అమరావతి జ్యోతి:: సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న విడుదల చేసిన వైయస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రజా ఆమోదం పొందేదిగా లేదని బిజెపి జనసేన టిడిపి కూటమి అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడవరోజు మండలంలోని చింతలపాలెం, పచ్చవ, వర్ధిని వారి పాలెం, గంగారెడ్డి పాలెం, కొత్తపాలెం, పేరాపురం, తూమాడు, పాలేటిపాడు, సాదువారిపాలెం, గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి స్వామి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాలన మీద తానే నమ్మకం కోల్పోయినట్లు వ్యవహరిస్తున్నారని స్వామి ఆరోపించారు. ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలకు అందించడం మేలు చెప్పుకోలేక ఆడవారి వస్త్రాదరణ పై మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. వైసీపీ ప్రభుత్వం లో ప్రకాశం జిల్లాకు ఒరిగిందేమీ లేదని, వెలగొండ ప్రాజెక్టు వద్ద పూర్తికాని పనులు కూడా ప్రారంభోత్సవాలు అంటూ హడావుడి చేయటం దారుణం అన్నారు. ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉండి జిల్లాకు గానే నియోజకవర్గాన్ని కానీ ఆయన చేసింది ఏమీ లేదన్నారు. ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా తాము చేసింది చెప్పుకొని ఓట్లు అడుగుతారు కానీ ఈ వైసీపీ నాయకులు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజలను మభ్యపెట్టడానికి వస్తున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా మనకు అవకాశం ఇవ్వాలని స్వామి కోరారు. ఒక్క ఛాన్స్ అంటూ మళ్లీ మోసపోవడానికి కొండేపి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా లేరని వలసపక్షనీ కొండపి నియోజకవర్గం నుంచి తరిమి కొట్టడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పోకూరి రవీంద్రబాబు, పోటు పద్మావతి, పోటు పెదబాబు, విజయనిర్మల, స్థానిక నాయకులు గాలి సందీప్, హరిబాబు సీతారామయ్య, చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, కామాక్షయ్య తోపాటు జనసేన సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, బిజెపి నాయకులు బాలకోటయ్య తో పాటు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :