Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఇంటూరి నాగేశ్వరరావు ఉలవపాడు: మండలంలోని కరేడు పంచాయతీ అలగాయపాలెం (కొత్త రెడ్డిపాలెం) గ్రామంలో ఆదివారం ఉదయం 8 గంటలకు జరిగిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.. ముందుగా గ్రామస్తులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కి ఘన స్వాగతం పలికారు.. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య విగ్రహా శంకుస్థాపన పూజా కార్యక్రమం జరిగింది.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం ప్రజల ఆత్మీయ అనుబంధానికి ప్రతిగా నిలుస్తుందని, నిత్యం నేను కొలిచే శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు..ఉలవపాడు నుంచి అలగాయపాలెం వచ్చే రోడ్డు వద్ద రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి, ఉలవపాడు రైల్వే స్టేషన్ లో సూపర్ ఫాస్ట్ రైలు నిలుపుదల చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.. కందుకూరు నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు.. నెల్లూరులో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువత ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు.. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఆంజనేయస్వామి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.. గత వైసిపి ప్రభుత్వం లో రాష్ట్రానికి అస్తవ్యస్తంగా పరిపాలించారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు యువ నాయకులు నారా లోకేష్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే వృద్ధాప్య పెన్షన్ పెంపుదల శాశ్వత వికలాంగులకు 15000 రూపాయల పెన్షన్, మెగా డీఎస్సీ, అన్నా క్యాంటీన్లు, దీపం పథకం లాంటి మరెన్నో పథకాలను ప్రజలకు అమలు చేశారని ఎమ్మెల్యే తెలిపారు.. కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి త్రాగు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పన సమకూర్చటమే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు.. ఈ కార్యక్రమానంతరం గ్రామస్తులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని ఘనంగా సత్కరించారు.. ఈ కార్యక్రమంలో ఉలవపాడు మండల టిడిపి అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు కూటమి నేతలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi