Monday, 15 June 2026 03:53:04 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

అపార్ ఐడి కార్డుల మంజూరు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ఆనంద్

Date : 05 November 2024 10:06 PM Views : 791

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అపార్ ఐడి కార్డుల మంజూరు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి ... జిల్లా కలెక్టర్ ఆనంద్ జిల్లాలోని ప్రభుత్, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థిని, విద్యార్థులందరికీ అపార్ ఐడీ కార్డుల మంజూరు ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాల్లో రెవెన్యూ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యూటేషన్లు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, పాఠశాల విద్యార్థులకు అపార్ ఐడి కార్డులు మంజూరు, ఉపాధిహామీ పనిదినాల పెంపు, పాఠశాలల్లో మనబడి మన భవిష్యత్తు అభివృద్ధి పనుల పూర్తి మొదలైన అంశాలపై సబ్‌కలెక్టరు, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడీవోలు, తహశీల్దార్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ కార్డు లోని వివరాలకు, స్కూలు రికార్డు లోని వివరాలకు సరిపోయిన విద్యార్థిని విద్యార్థులకు వెంటనే అపారు ఐడి కార్డు మంజూరు చేయాలని, ఒకవేళ ఆధార్ కార్డు లో సరిగా ఉండి, స్కూల్ రికార్డుల్లో తేడా ఉన్నట్లయితే సంబంధిత రికార్డులను సరిచేసి, నిర్ణిత ఫారంలో పూర్తిచేసి అపారు ఐడి కార్డు మంజూరు చేయాలన్నారు. ఈ రెండు కేటగిరీల విద్యార్థిని విద్యార్థులకు వారం రోజుల్లోపు సంబంధిత ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మిగిలిన వారి విషయంలో ఆధార్ కార్డులో మార్పు చేర్పులకు సంబంధిత పాఠశాలలోనే ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఈ నెల 14 న మెగా తల్లిదండ్రుల కమిటీ సమావేశాలు రాష్ట్రమంతటా ఒకే రోజున ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా పి జి ఆర్ ఎస్ లో వచ్చేటువంటి అర్జీలను ఆడిట్ చేసేందుకు ప్రత్యేకంగా పదిమంది అధికారులతో టీమును నియమించామన్నారు. ఈ టీం సభ్యులు జిల్లా మొత్తంలో వచ్చిన అర్జీలను పరిష్కరించిన విధానంను పరిశీలిస్తారని, సరైన కారణం లేకుండా తిరస్కరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవన్నారు. అదేవిధంగా హౌసింగ్ లో స్టేజ్ కన్వర్షన్ల పై దృష్టి పెట్టాలని, కంప్లీషన్ దశలో ఉన్న ఇళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పని దినాలు పెంచాలని, 70 వేల పనిదినాల లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోవాలని, అలాగే నరేగా పనుల్లో ప్లాంటేషన్ ఫిట్టింగ్, ఫామ్ పాండ్స్ పూర్తి చేయుటకు మట్టి పనుల్లో లేబర్ కాంపౌండ్ పెరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా పంచాయతీల్లో ప్రతిరోజు క్లోరినేషన్ చేయాలని , ఓహెచ్‌ఆర్‌ ట్యాంకులను శుభ్రపరచాలన్నారు. అలాగే అంగన్వాడీలలో మంచినీటి వసతి సౌకర్యం, టాయిలెట్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్, డిఆర్‌వో ఉదయభాస్కర్ , జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి , జడ్పీ సీఈవో మోహన్ రావు, హౌసింగ్‌, డ్వామా పిడి లు వేణుగోపాల్ , గంగా భవాని, డీఈవో బాలాజీ రావు, సర్వ శిక్ష ఏపీవో ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :