Monday, 15 June 2026 03:52:40 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

సిద్ధం సభను జయప్రదం చేయాలి: బుర్రా మధుసూదన్

Date : 08 March 2024 11:53 PM Views : 272

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : సిద్ధం సభను జయప్రదం చేయాలి - బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరు , అమరావతి జ్యోతి: మేదరమెట్ల దగ్గర ఈనెల పదో తారీఖున జరుగుతున్న సిద్ధం సభను విజయవంతం చేయాలని, కందుకూరు నియోజకవర్గం వైయస్సార్ సిపి సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ పిలుపునిచ్చారు స్థానిక రోడ్డు మరియు భవనాలు అతిధి గృహం లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి వలన ప్రజా జీవితంలో మార్పులు కనపడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి అవినీతి, పక్షపాత వైఖరి లేకుండా లబ్దిదారులకు నేరుగా పధకాలను అందించడం జరిగింది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమం ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి స్వంత గృహం ఏర్పాటు చేశారు. విద్యా, వైద్య రంగంలో విశేష కృషి చేస్తున్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు కళాశాలలు బాగుపడిన తీరు అమోఘం. దేశంలో ఏ రాష్ట్రం కల్పించ లేని విధంగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు. తీర ప్రాంతంలో పోర్టులు, హార్బర్ లు నిర్మాణం చేపట్టి పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డికే చెందినది. సాగు నీటి ప్రాజెక్టులు అనుకున్న సమయానికి అనుకున్నట్లు పూర్తిగావించి జాతికి అంకితం చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మీ ఇంట్లో మేలు జరిగితేనే ఓటు వేయమని అడుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకే నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ని కందుకూరు అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి రాబోయే ఐదేళ్ల కాలంలో ఏమి చేస్తాడో మ్యానిఫెస్ట్ ద్వారా ప్రజలకు వివరించి చెప్పుతారు అని అన్నారు సిద్ధం సభను యువత, మహిళలు,రైతులు అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని కోరారు నియోజకవర్గం లో అన్ని మండలాల నుంచి భారీగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు అని అన్నారు. ఈ సమావేశంలో వైయస్సార్ సిపి పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, జె సి యస్ కో ఆర్డినేటర్ ముప్పవరపు కిషోర్, యస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు రేణమాల అయ్యన్న , కన్వీనర్ కందగడ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :