Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఉలవపాడు: ఎటు చూసినా జనం.. మహిళల హారతులు.. యువత కేరింతలు.. వృద్ధుల ఆశీర్వాదాలు.. మండుటెండలో ఎక్కడా వెనకడుగు వేయకుండా ఒకటే పరుగులు... ఉదయం మొదలుపెడితే రాత్రి వరకు, అదే అభిమానం.. అదే ఉత్సాహం.. సోమవారం ఉలవపాడు మండలంలో ఎన్డీఏ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఇలా హోరెత్తింది. అభిమాన నేతలకు ప్రజలు అడుగడుగునా హారతులు పట్టారు. తమ గ్రామాల్లోకి అట్టహాసంగా ఆహ్వానిస్తూ జేజేలు పలికారు.తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు మండలంలోని పలు పంచాయతీల్లో సుడిగాలి పర్యటన చేశారు. వీరేపల్లి, ఉలవపాడు, ఆత్మకూరు, కరేడు, చాకిచెర్ల పంచాయతీల్లో కిక్కిరిసిన జనం మధ్య రోడ్ షో కొనసాగింది. మాజీ శాసనసభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దివి శివరాం, నియోజకవర్గ పరిశీలకురాలు కుసుమకుమారి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉలవపాడు మండల ప్రజలు చూపిస్తున్న అభిమానం మరిచిపోనని, ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన తాను... ఎంపీగా గెలిచాక, బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసించే ఉలవపాడు మండలానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సేవా కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు. ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలను, రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసిన జగనాసురుడిని సాగనంపే సమయం వచ్చిందని అన్నారు. అదే సందర్భంలో, గతంలో తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి కారణమైన చంద్రన్నను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. ఇంతటి స్పందనను చూస్తుంటే ప్రజా కూటమికి తిరుగులేని విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ... ఈనెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ ఇద్దరికీ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి, సేవచేసే అదృష్టం కల్పించాలని అభ్యర్థించారు. ఈ ఐదారు రోజులు.. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి, వైసిపి మోసాలను, ప్రలోభాలను ప్రజలకు వివరిస్తూ... తటస్తుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయాలని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వీరేపల్లి ఎస్టీ కాలనీ, కే.రాజుపాలెం, ఆత్మకూరు, కరేడు చాకిచెర్లలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు రాచగల్లు సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో... టిడిపి నాయకురాలు ఉన్నం నళినీదేవి, క్లస్టర్ ఇంచార్జ్ లు బెల్లం కృష్ణమోహన్, పోలుబొయిన శ్రీనివాసులు, సుదర్సి శ్రీనివాసులు, ఎంపీటీసీ దార్ల యలమందమ్మ, మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు సన్నెబోయిన ప్రభావతమ్మ, మండల బీసీ సెల్ అధ్యక్షులు ఓగుబోయిన యానాది, మండల తెలుగు యువత అధ్యక్షులు తొట్టెంపూడి మాల్యాద్రి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు రావినూతల రమేష్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు మోజేస్, పార్టీ సీనియర్ నాయకులు శ్యాంగోపాల్ రెడ్డి, చెంచురామిరెడ్డి, మల్లవరపు సుబ్బారెడ్డి, జువ్విగుంట యలమంద, ఆత్మకూరు సర్పంచ్ నాళం గోవిందమ్మ, గ్రామ పార్టీ అధ్యక్షులు మోదుగుల గురవయ్య, అంచుపోగు వాసు, కన్నా ప్రసాదు, మిరియం మల్లికార్జున పార్టీ నాయకులు లక్కంరాజు నరేష్, ఆదినారాయణరాజు, సుధాకర్ వర్మ, మార్టూరి కోటేశ్వరరావు, వెర్రి శంకర్, అమరనేని రాములు, డాక్టర్ కరీం, ఎందేటి శ్రీనివాసులు, మిరియం భాస్కర్, చేతల భాస్కర్, చింతల సింగయ్య, మెట్టా శ్రీనివాసరెడ్డి, కార్యకర్తలు హాజరయ్యారు.
Admin
Amaravathi Jyothi