Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : బీసీ డిక్లరేషన్ పై హర్షం వ్యక్తం చేసిన ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు, అమరావతి జ్యోతి: బీసీ డిక్లరేషన్ పై హర్షం వ్యక్తం చేసిన కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, రాబోయే ఐదేళ్లలో బీసీల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా నారా చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ప్రకటించారని అన్నారు. 50 సంవత్సరాలు దాటిన బీసీలకు నెలకు 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పటం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. అలాగే బీసీలకు రక్షణ చట్టం, బీసీ సబ్ ప్లాన్ ద్వారా ప్రతి ఏటా నిధుల కేటాయింపు, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ లాంటి అంశాలు హైలెట్ గా ఉన్నాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలపై ఎంత ప్రేమ ఉందో, అలాగే బీసీలు పార్టీకి ఎంత అండగా నిలుస్తున్నారో చెప్పటానికి నిన్నటి బహిరంగ సభే ఉదాహరణ అని నాగేశ్వరరావు అన్నారు. మూడో వార్డు ఉప్పు చెరువు మొదటి లైన్ ప్రాంతంలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నాగేశ్వరరావును స్థానిక ప్రజలు ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. పార్టీలకతీతంగా స్థానికులు నాగేశ్వరరావు వెంట నడుస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై స్థానికుల్లో ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ తెలిసేలా, బహిరంగంగానే నినాదాలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. నాగేశ్వరరావు ప్రతి గడపకు వెళ్లి, ఆ కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, స్థానిక సమస్యల గురించి ఓపిగ్గా విని, రాబోయే ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని చెబుతూ, ఈసారి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. కందుకూరు నియోజకవర్గం నుంచి తనను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, వార్డు అధ్యక్షుడు పువ్వాడి కోటయ్య, 3వ వార్డు నాయకులు మరియు చిలకపాటి మధుబాబు, వడ్డెళ్ళ రవిచంద్ర, రెబ్బవరపు మాల్యాద్రి, రాయపాటి శ్రీనివాసరావు, షేక్ మున్నా, షేక్ సలాం, పులి నాగరాజు, కల్లూరి వెంకటేశ్వర్లు, పీలా శ్రీనివాసులు, సయ్యద్ జియావుద్దీన్, నగర జయకృష్ణ, షేక్ గౌస్ బాషా, షేక్ శతాక్షి, ముప్పవరపు వేణు, మచ్చ మనోహర్, గుమ్మా శివ, మనికే మాల్యాద్రి, బద్దిపూడి శికామణి ఇతర నాయకులు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi