Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మాలకొండ ఆదాయం రూ 86,79,136 వలేటివారిపాలెం, అమరావతి జ్యోతి: మండలంలోని మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించగా రూ.86,79,136లు ఆదాయంగా సమకూరిందని ఆలయ సహాయ కమిషనరు కేబీ శ్రీనివాస రావు తెలిపారు. శుక్రవారం పర్యవేక్షణ అధికారి బైరాగి చౌదరి ఆధ్వర్యంలో ఆలయంలోని హుండిలను తెలిసి కానుకలను లెక్కించడం జరిగిందన్నారు. భక్తులు 13 వారాలు పాటు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూ. 86,79,136, బంగారం 310 గ్రాములు, వెండి 1845 గ్రాములు, యు ఎస్ డాలర్స్ 54, కెనడా డాలర్స్ 10, ఇంగ్లాండ్ పౌండ్స 10, ఆస్ట్రేలియా డాలర్స్ 5 వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై బి మహేంద్ర నాయక్, అయ్యవారిపల్లె సర్పంచ్ డేగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi