Amaravathi Jyothi - Andhra Pradesh / అమరావతి : కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు గారికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు, ప్రశాంతిరెడ్డి దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సోమవారం అమరావతిలోని సీఎం నివాసానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు.. ఈ సందర్భంగా సీఎం గారిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. టిటిడి బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించడంపై సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దేవదేవుడి సేవకు అవకాశం రావడం సంతోషంగా ఉందని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా శ్రీవారి భక్తులకు సేవ చేస్తామని వారు స్పష్టం చేశారు.
Admin
Amaravathi Jyothi