Monday, 15 June 2026 03:48:46 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

పరిశ్రమల ఏర్పాటుతో రూఫు రేఖలు మారనున్న కరేడు యువతకు లభించనున్న ఉపాధి, ఉద్యోగావకాశాలు

672.279 ఎకరాలకు అవార్డు పాస్‌ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

Date : 21 October 2025 09:06 PM Views : 398

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పరిశ్రమల ఏర్పాటుతో కరేడు గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం వేగవంతంగా భూసేకరణ చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ఆయన అన్నారు. మొత్తం సుమారు 4800 ఎకరాల భూసేకరణ అవసరం కాగా, ఇప్పటివరకు 672.279 ఎకరాలకు సంబంధించి రైతులకు అవార్డు పాస్‌ చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ఇందులో తాజాగా 79.745 ఎకరాలకు సంబంధించి అవార్డు పాస్‌ చేయడం జరిగింది. భవిష్యత్తులో మరింత వేగంగా భూసేకరణ కొనసాగిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. భూసేకరణకు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధికి ముందుకొస్తున్న రైతులకు కలెక్టర్‌ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉపాధి, ఉద్యోగాలు స్థానిక యువతకు లభించనున్నాయి. ఇది కేవలం కరేడుకు మాత్రమే కాకుండా, మొత్తం జిల్లాకు ఒక పెద్ద ఆర్థిక బలం కలిగించనుంది. *భూములు కోల్పోయిన వారికి భరోసా* పరిశ్రమల కోసం తమ భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందిస్తోంది. సంతృప్తికరమైన నష్టపరిహారం, పునరావాసం, పునరుద్ధరణ చర్యలతో భూములు ఇచ్చిన కుటుంబాలకు భరోసా కల్పిస్తోంది. తాము ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు జీవనోపాదులు స్థిరపడతాయని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 79.745 ఎకరాల భూములకు సంబంధించి రైతులకు అవార్డు పాస్‌ చేయడం జరిగింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 672.279 ఎకరాలకు అవార్డు ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్‌ తెలిపారు. *మన గ్రామాల సమగ్ర అభివృద్ధి* ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటుతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త నాంది పలుకనుంది. రోడ్లు, విద్యుత్‌, నీరు వంటి మౌళిక వసతులు మరింత మెరుగుపడతాయి. దీనితోపాటు చిన్న చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌ కంపెనీలు కూడా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు లభించడం ద్వారా వారు పరిశ్రమల్లో ఎక్కువగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది.కరేడు గ్రామంలో ప్రారంభమైన ఈ భూసేకరణ భవిష్యత్తు తరాల కోసం ఒక అభివృద్ధి పథం. పరిశ్రమల రాకతో వేలాది కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు జీవనోపాధికి స్థిరపడతాయి. రైతులకు నష్టపరిహారం అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ప్రభుత్వం సమగ్రాభివృద్ధికి కృషిచేస్తోందని కలెక్టర్‌ అన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :