Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లోకేష్ ను కలిసినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే మహీదర్ రెడ్డి. కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి నారా లోకేష్ ని కలిసినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే మహీదర్ రెడ్డి పూర్తిగా ఖండించారు.కొందరు ఉద్దేశ్య పూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఈ విష ప్రచారము ఒక న్యూస్ ఛానల్ వారు మరియు కొంతమంది సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తున్నారు వాళ్ళందరిపై కూడా డీఎస్పీ కందుకూరు వారికి కలిసి వాళ్లపై చర్య తీసుకోమని కోరడం కూడా జరిగింది అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది వాళ్లపై కేసులు కూడా పెడతాము ఇలాంటి చర్యలు పైన కఠిన చర్యలు తీసుకోమని కూడా పోలీస్ అధికారులను కోరుతాము అని హెచ్చరించారు.
Admin
Amaravathi Jyothi