Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : 16వ వార్డు నుండి తండోప తండాలుగా వైసీపీ నుండి టీడీపీ లోకి చేరికలు కావలి,అమరావతి జ్యోతి: రాష్ట్ర పార్టీ దివ్యాంగుల ఉపాధ్యక్షులు మండవ వెంకట్రావు, 16వ వార్డు నేతలు ఇగుటూరి మాల్యాద్రి, పాశం రమణారెడ్డి, మోర్ల శివకుమార్ గౌడ్, వెంకట కృష్ణ గౌడ్, బాబ్జీ, పల్లపు శివ, విజయ్ ఆధ్వర్యంలో 16వ వార్డు నుండి తండోప తండాలుగా వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు.. ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 16వ వార్డు నుండి 73 కుటుంబాలు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. వీరికి తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.. ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.. కావలిని అభివృద్ధి చేసి చూపెడతానని అన్నారు..
Admin
Amaravathi Jyothi