Monday, 15 June 2026 03:49:05 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

గురువును మించిన దైవం లేదు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో కాకర్ల సురేష్

Date : 10 March 2024 09:28 PM Views : 240

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గురువును మించిన దైవం లేదు.. మీ ఆత్మీయతను ఎన్నడూ మరువను.. ఉదయగిరి నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వింజమూరు, అమరావతి జ్యోతి: గురువుకు మించిన దైవం లేదని మీ ఆత్మీయతను ఎన్నడూ మరువను అని ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరులోని ఎస్వీ కళ్యాణమండపంలో ఆదివారం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాకర్ల సురేష్ మాట్లాడుతూ తల్లి తండ్రి తర్వాత ఉపాధ్యాయులను దైవంగా చూస్తానని ఆయన తెలిపారు. సుధీర ప్రాంతాల నుండి అనేక కష్టనష్టాలకు ఓర్చి ఇంత దూరం వచ్చిన మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మెట్ట ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివి అంచలంచెలుగా ఎదిగి అమెరికాకు వెళ్లిన నేను పుట్టిన గడ్డపై మమకారంతో ఈ ప్రాంత అభివృద్ధి సంపద సృష్టించేందుకు వచ్చానని మీరందరూ ఆదరిస్తే మార్పు తీసుకొస్తానని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. విద్య వైద్యానికి పెద్దపీట వేస్తానని తెలిపారు. కనుక వచ్చే ఎన్నికల్లో మీరందరూ నాకు అండగా నిలవాలని కోరారు. అంతకుమునుపు ఎల్ సి రమణారెడ్డి మాట్లాడుతూ కాకర్ల సురేష్ గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ రోగుల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రధం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు యువతను ప్రోత్సహించేందుకు క్రీడా పోటీలు మహిళలు మహారాణులు చేసేందుకు టైలరింగ్ బ్యూటిషన్ కోర్సులు మూగ జీవాల కోసం ఎడారి ప్రాంతంలో బోరింగులు అభాగ్యులకు ఆర్థిక సహాయం నూతన వధూవరులకు పెళ్లి కానుకలు అందజేస్తూ అందరి ఇంటఆపద్బాంధవుడు అయ్యాడు, కాకర్ల సురేష్ అని పేర్కొన్నారు. ఆయన ఈ నియోజకవర్గంలో జన్మించడం ఇక్కడ అభివృద్ధి కోరుకోవడం మన అదృష్టంగా భావించి మనమందరం ఆయనకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నికల హామీలోభాగంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని తెలిపి, ఐదు సంవత్సరాలుకాలయాపన చేసి కల్లబొల్లి మాటలతో మన గొంతు నొక్కుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మనం అధోగతి పాలవుతామని ఈ ప్రభుత్వానికి సమర గీతం పాడి టిడిపిని అధికారంలోనికి తెచ్చుకొని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకొని కాకర్ల సురేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. చప్పట్లతో ఉపాధ్యాయులు అందరూ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మండలాల వారీగా కాకర్ల సురేష్ ను ఉపాధ్యాయుల బృందం శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్ ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు సంక్షేమ వసతి గృహాల వార్డెన్ లు సిబ్బంది అభిమానులు తదితరులు ఉన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :