Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : దోమల నివారణకు తీసుకునే చర్యల్లో భాగంగా ఫాగింగ్ లో ప్రజా ప్రతినిధి కొల్లూరి గోవింద్ వలేటివారిపాలెం అమరావతి జ్యోతి :వలేటివారిపాలెం మండలం లో నేకునాంపురం గ్రామపంచాయతీ పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమలను నివారించేందుకు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని గ్రామ సర్పంచి గారైన కొల్లూరు లక్ష్మమ్మ కొల్లూరి గోవింద్ పంచాయతీ కార్యదర్శి ఎం మాధవి ఆధ్వర్యంలో భాగింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామమంతా తిరిగి ఫాగ్గింగ్ చేయించటం జరిగింది. డ్రైనేజీలలో నీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ కొల్లూరు లక్ష్మమ్మ కొల్లూరు గోవింద్ పంచాయతీ కార్యదర్శి ఎం మాధవి గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi