Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఇష్టంతో చదివితే ఉజ్వల భవిష్యత్తు వలేటివారిపాలెం అమరావతి జ్యోతి : ప్రతి విద్యార్థి ఇష్టంతో కష్టపడి చదివితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉండగలదని మాజీ సర్పంచ్ ఉన్నం వెంకటేశ్వర్లు విద్యార్థులకు సూచించారు. నలదలపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బీరకాయల మాధవరావు ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవము, పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ అధినేత కంచర్ల రామయ్య మాట్లాడుతూ విద్యార్థి ఎదుగుదలకు క్రమశిక్షణ ముఖ్యమని అన్నారు. తాను ఈ పాఠశాల పూర్వ విద్యార్థినేనని, పాఠశాలకు గేటు ఏర్పాటు వేయించానని తెలిపారు. ఆరవ తరగతి నుండి అవతరగతి వరకు ఉత్తమ విద్యార్థులకు బహుమతులు ఈ సంవత్సరం నుండే ఇస్తానని చెప్పారు. పాలిటెక్నిక్ పరీక్ష రాసే 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ తమ కాలేజీలో ఇవ్వడంతోపాటు ప్రవేశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. B.tech విద్యను ముఖ్యంగా నలదలపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఫీజు రాయితీతో చేర్చుకుంటామని తెలిపారు. విద్యార్థులకు రూ 6వెలు విలువ చేసే 35 జిప్ ఫైళ్ళు గణిత ఉపాధ్యాయని పద్మావతి, మాజీ సర్పంచ్ ఉన్నం వెంకటేశ్వర్లు కలిసి విద్యార్థులకు ప్రధానం చేశారు. ఈ కార్య క్రమమునకు ఎం ఈ ఓ మల్లిఖార్జునరావు, కే జి బి వి పాఠశాల స్పెషలాఫీసరు గోవర్ధ ని గారు, ముప్పాళ్ళ హెచ్ఎం ఆదాము, స్థానిక పినాకినీ మేనేజరు శ్రీకాంత్, స్థానిక సచివాలయ సిబ్బంది, అంగన్ వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi