Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి డాక్టరేట్ కందుకూరు అమరావతి జ్యోతి: టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కందుకూరు నందు చరిత్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డి. రామాంజనేయులు కు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం వారు డాక్టరేట్ అందజేయడం జరిగింది. రామాంజనేయులు,"*క్విట్ ఇండియా ఉద్యమం యొక్క చారిత్రక అధ్యయనం, నూతన దృక్పథంతో పరిశీలన*"అను అంశం మీద చేసిన పరిశోధన గాను డాక్టరేట్ అందజేయడం జరిగింది. ఈ పరిశోధన ప్రొఫెసర్ కే. మల్లికార్జున రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవి కుమార్, మరియు అధ్యాపక బృందం రామాంజనేయులు అభినందించారు. టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొత్తం 25 మంది అధ్యాపకులు డాక్టరేట్ డిగ్రీలు కలిగి ఉన్నారని, వారి యొక్క అనుభవాన్ని విద్యార్థినీ విద్యార్థులు అందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కందుకూరు మరియు పరిసర ప్రాంత విద్యార్థులను కోరారు.
Admin
Amaravathi Jyothi