Sunday, 26 April 2026 08:25:41 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

అస్పృశ్యతకు తావులేని సమాజాన్ని కలగన్నవాడు మహాకవి గుర్రం జాషువా

Date : 28 September 2025 12:40 PM Views : 224

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు:మహాకవి, నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల,పద్మ విభూషణ్,కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, శాసనమండలి సభ్యులు విశ్వ నరుడు గుర్రం. జాషువా 130వ జయంతి సభ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగినది. పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ అధ్యక్షత వహించగా పలువురు వక్తలు జాషువా సాహిత్య సేవలను కొనియాడారు. సమాజంలోని అసమానతలు, వివక్షతలు,దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సామాజిక దృక్పథంతో రచనలు కొనసాగించిన కవి యోధుడు జాషువా అని వక్తలు అభిప్రాయపడ్డారు. రాజు మరణించి ఒక తార నేలరాలే, సుకవి మరణించే ఒక తార గగనమెక్కే అని సమాజంలో కవి గౌరవాన్ని పెంచినవాడు. సమాజంలో అట్టడుగు అణగారిన వర్గ దళితున్ని కథానాయకునిగా తీసుకొని గబ్బిలం కావ్యం ద్వారా సందేశం ఇచ్చిన కవి, ప్రజల నాలుకలపై నర్తించే విధంగా సత్య హరిచంద్రలోని కాటిసీను పద్యాలన వీనులవిందుగా రచించారు. స్మశానంలో రాజు,బంటు పేద, గొప్ప అనే బేదభావం ఉండదని ఇచ్చట అస్పృశ్యతకు తావే లేదని స్మశానాన్ని వర్ణించిన కవి కోకిల గుర్రం జాషువా. కుల కట్టుబాటులను మతం ఆంక్షలను వ్యతిరేకించి ప్రేమ వివాహం చేసుకున్న యాదవ తండ్రి మాదిగ తల్లి మానవత్వాన్ని పునికి పుచ్చుకున్నవాడు జాషువా. సమాజ హితవు కోసం మహాకవి,విశ్వరుడు గుర్రం జాషువా సాహిత్యాన్ని నేటి తరానికి అందించాల్సిన ఆవశ్యకత ఉందని, సామాజిక స్పృహలో స్ఫూర్తిని అందించాలని అభిప్రాయపడ్డారు. ముందుగా కవి కోకిల,నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ తోకల కొండయ్య, రాష్ట్ర బూతు కమిటీ కార్యదర్శి గణేశం గంగిరెడ్డి, జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు ముప్పవరపు కిషోర్, కందుకూరు మండల అధ్యక్షులు ఈదర రమేష్, ఉలవపాడు మండల అధ్యక్షులు నన్నం పోతురాజు, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షులు నల్లమోతు చంద్రమౌళి, జిల్లా సెక్రెటరీ చీమల రాజా, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పాశం కొండయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వల్లూరీ కోటేశ్వరరావు, జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యదర్శి చనమాల కోటేశ్వరరావు, జిల్లా మున్సిపల్ సెక్రెటరీ నగళ్ల నారయ్య, ఎస్సీ సెల్ జిల్లా సెక్రెటరీ గేరా మనోహర్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు దగ్గుమాటి కోటయ్య, జిల్లా నాయకులు కూరపాటి వెంకట్రామిరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు యడ్ల మాధవరెడ్డి, పట్టణ సీనియర్ నాయకులు చింతలపూడి సురేష్ బాబు, క్రిస్టియన్ మైనార్టీ సెల్లు నియోజకవర్గ అధ్యక్షులు ఉచ్చులూరి రవీంద్ర, డాక్టర్స్ వింగ్ అధ్యక్షులు చింతలపూడి సుధాకర్, మైనారిటీ అధ్యక్షులు షేక్ రహీం, కన్వీనర్ కానాల ప్రసాద్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తుల్లూరి ఆదిలక్ష్మి, అంగనవాడి నియోజకవర్గ అధ్యక్షురాలు దేవరకొండ ఆదిలక్ష్మి, పట్టణ అధ్యక్షురాలు వసంత లక్ష్మి, పట్టణ కార్యదర్శి షేక్ బికారి, సీనియర్ నాయకులు షేక్ దస్తగిరి భాష, సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డం రెడ్డి మదన్మోహన్ రెడ్డి, కన్వీనర్ కరేటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: