Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : భయం స్వామి బయోడేటాలోనే లేదు: నేలపాటి బ్రహ పొన్నలూరు,అమరావతి జ్యోతి : వైసీపీలో ఐదుగురు అభ్యర్థులు మారినా స్థానిక ఎమ్మెల్యే స్వామి మాత్రం లోకల్ అంటూ ప్రజల వద్ద నమ్మకాన్ని చురగొన్నారని కొండపి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ నేలపాటి బ్రహ్మయ్య చౌదరి తెలిపారు. శనివారం ఆయన తన నివాసంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే స్వామి మీద వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ మంగళగిరిలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో సురేష్ తన అక్రమాలకు అండగా వుండే అధికారులను వేసుకుంటున్నారని ఆరోపించిన విషయం విదితమే. కాగా నేడు వైసీపీ నాయకులు గుమ్మడి కాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు మీరు ఎందుకు ఉల్లికిపడుతున్నారని నిలదీశారు సింగరాయకొండ తహసీల్దార్ కార్యాలయంలో వారం రోజుల వ్యవధిలో ముగ్గురు అధికారులను మార్చి కొత్త వ్యక్తిని తెచ్చిన విషయం నిజం కాదా. అధికార యంత్రాంగం అడ్డుపెట్టుకొని ఇలా వ్యవహరించడం ఏమౌతుందో వైసీపీ నాయకులే తెలపాలి. గత 20 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలతో మమకేమై వారి మంచి చెడ్డలు, బాగోగులు చూసే ఎమ్మెల్యే స్వామి ఎక్కడ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలని ఇప్పటికీ చూడని మీ మంత్రి ఎక్కడ. మండల ఎస్సి సెల్ నాయకులు గంధం నరసయ్య మాట్లాడుతూ స్వామి మరుగుదొడ్లలో అవినీతి చేసారని గత మీ ఇంచార్జి అశోక్ బాబు చేసిన హడావిడి అంతాఇంతా కాదు. ఏమైంది చేతకాక పారిపోయాడా లేక నిజం నిరూపించలేక మొఖం చాటేశాడా అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. చట్టం ఎవరి చుట్టం కాదని నమ్మే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ... అలాంటి పార్టీ మీద ఎమ్మెల్యే స్వామి మీద బురదజల్లాలని చుస్తే ఆ బురద మీ మొహాల మీద పడుతోందే తప్ప మరోటి కాదని గుర్తుచేస్తున్న. నియోజకవర్గంలో తిరుగులేని నేతగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎక్కడ ఆయనతో పాటు రాజకీయ అరంగేట్రం చేసి మూడు నియోజకవర్గాలు తిరిగిన మీ మంత్రి ఎక్కడ అని ప్రశించారు. మీ చిట్టా కావాలంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ తో కలిపి ఇప్పటికి స్వామి మీద ఐదుగురు తలపడ్డారు.ఎక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం, ఆవశ్యకత నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే స్వామి కల్పించలేదు. ఎమ్మెల్యే స్వామికి మద్దతుగా నియోజకవర్గం ఆయన వెంట ఉంటుందని రెండు సార్లు నిరూపించి, హ్యట్రిక్ ఎమ్మెల్యే చేయడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంకా మీ వైసీపీ నాయకులు సృహ లేకుండా మాట్లాడుతున్నారు 100 శాతం జగన్నన్న హామీలు నేరచేర్చారని గొప్పలు పోవడం తప్ప ప్రత్యేక హోదా ఏమైంది, పోలవరం ఏమైంది, సీపీస్ రద్దు ఏమైంది, మెగా డిస్సి ఎక్కడ, ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్, వృధాశ్రమం ఎక్కడ, అర్హత ఉన్న ప్రతి రైతుకి జలకళ బోర్ ఎక్కడ, రైతు గిట్టుబాటు ధర ఎక్కడ, ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ, 45 ఏళ్లకు పెన్షన్ ఎక్కడ, మద్యపాన నిషేధం అంటూ రాష్ట్ర ప్రజలని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కదా అని నిలదిస్తున్నాం... వైసీపీ నయకులరా మీకు నిజంగా దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.... మీ ఏ చర్చలకు పిలిచినా, ఏ సవాల్ విసిరిన తెలుగుదేశం పార్టీ ఎపుడూ సిద్ధంగా ఉందని తెలియజేసారు.
Admin
Amaravathi Jyothi