Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జగన్ దృష్టిలో ముస్లింలంటే ఓటుబ్యాంకు మాత్రమే ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఇంటూరి కందుకూరు అమరావతి జ్యోతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే కందుకూరు నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధి జరిగిందన్నది అక్షరసత్యమని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణంలోని 18వ వార్డు, ఉర్దూస్కూల్ వద్ద ముస్లింలతో నాగేశ్వరరావు ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు. ముస్లిం సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో హాజరై, తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. ముఖ్యంగా యువకులు ఎంత ఉత్సాహంతో నాగేశ్వరరావుకి ఘన స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో వందల మందికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. . జగన్మోహన్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యేకు ముస్లింలు కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే కనిపిస్తున్నారని నాగేశ్వరరావు విమర్శించారు. గత ఎన్నికలకు ముందు అమలవుతున్న పథకాలు నిలిపివేసి ముస్లిం సమాజాన్ని నిలువునా మోసం చేశారని అన్నారు. కందుకూరు నియోజకవర్గంలో ఎవరి హయాంలో ముస్లింలకు మేలు జరిగిందో చర్చకు సిద్ధమేనా అని నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో... షేక్ హాజీ బాషా, షేక్ షాజహాన్, ఇంకా పలు కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు.
Admin
Amaravathi Jyothi