Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి కందుకూరు అమరావతి జ్యోతి: క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా కందుకూరు నియోజకవర్గ క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుప్రభువు చూపిన మార్గం శాంతి, సహనం,ప్రేమ మార్గాలలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. భక్తిశ్రద్ధలతో క్రిస్టమస్ పర్వదినాన్ని జరుపుకోవాలని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్ పండగ మీ జీవితాల్లో కొత్త పుంతలు తొక్కాలని ఎమ్మెల్యే అన్నారు. ఏసుప్రభువు దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఆకాంక్షించారు
Admin
Amaravathi Jyothi