Sunday, 26 April 2026 08:22:52 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

అంగన్వాడీలకు మద్దతుగా బొల్లినేని రామారావు

Date : 17 December 2023 06:46 AM Views : 204

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అంగన్వాడీల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొల్లినేని వెంకట రామారావు వింజమూరు, అమరావతి జ్యోతి: వింజమూరు మండలం వింజమూరు సిడిపీవో కార్యాలయం వద్ద జరుగుతున్న అంగన్ వాడీ ల సమ్మెకు మద్దతు తెలుపుతూ, అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో బొల్లినేని వెంకట రామారావు పాల్గొని అంగన్వాడీ లకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్బంగా బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ... అంగన్వాడీలకు గ్రాట్యూటి ఇవ్వాలని, గత ఆరు నెలల నుండి పెండింగ్లో పెట్టిన సెంటర్ అద్దెలు, టిఏ బిల్లులు తక్షణం చెల్లించాలని, ఆయాల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచి, రాజకీయ జోక్యాన్ని నివారించాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు, ప్రమోషన్లు కల్పించాలని, ఫేస్ రికగ్నైజేషన్ యాప్ రద్దు చేయాలని, సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బీమా అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించి, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఏ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాల తాళాలు పగులగొట్టే విధంగా ప్రవర్తించడం చాలా దారుణంగా ఉంది. నాణ్యమైన సరుకులు అందించడంలో విఫలమైందని ఆరోపించారు. చర్చల పేరుతో కాలయాపన తప్ప సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, విధిలేని పరిస్థితుల్లో అంగన్వాడి కార్మికులు నిర్వహిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందని తెలియజేశారు. గతంలో రూ.10,000 లు పెంచిన ఘనత చంద్రబాబుదని తెలిపారు. తెలంగాణలో అంగన్వాడీలకు 13,650/- చెల్లిస్తుంటే, అదనంగా చెల్లిస్తానన్న జగన్ ఆంధ్రప్రదేశ్ లో 11500/- చెల్లిస్తూ, ఆయమ్మకు 7వేలు మాత్రమే చెల్లిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలనుండి జగన్ ప్రభుత్వం దూరం పెట్టిందని, జీతాలు చెల్లించేటప్పుడు మాత్రం మీకు ప్రభుత్వానికి సంబంధం లేదంటూ వ్యవహరిస్తుందని విమర్శించారు. 2024 లో చంద్రబాబు సీఎం అయ్యిన తరువాత టీడీపీ అధికారంలో కి వచ్చాక అంగన్వాడీ ల సమస్యలు టీడీపీ పార్టీ దృష్టికి తీసుకెళ్తామని, సమస్యలు పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల టిడిపి శ్రేణులు నాయకులు, కార్యకర్తలు పాల్గోని, సంఘీభావం తెలిపారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: