Monday, 15 June 2026 03:56:35 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేద్దాం: ఇంటూరి నాగేశ్వరరావు

Date : 10 March 2024 09:09 PM Views : 318

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వైసిపికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేద్దాం దోపిడీలు, మోసాలే జగన్ నైజం టిడిపి ప్రభుత్వం కోసం జనం ఎదురుచూస్తున్నారు కందుకూరు, అమరావతి జ్యోతి: జగన్మోహన్ రెడ్డి మొదటినుంచి మోసగాడే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, సూట్ కేస్ కంపెనీలు సృష్టించి వేల కోట్లు దోచుకోబట్టే 16 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని కూడా అదేవిధంగా దోచుకున్నాడు. ఈసారైనా ప్రజలు మేలుకోకపోతే బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుందని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. శంఖారావం కార్యక్రమాన్ని కందుకూరు పట్టణంలో ఆదివారం ఉదయం 31వ వార్డు నాంచారమ్మ కాలనీ ప్రాంతాలలో నిర్వహించగా, నాగేశ్వరరావు పాల్గొని పార్టీ మినీ మేనిఫెస్టో వివరిస్తూ కరపత్రాలు పంచారు. జగనాసురుడు పెడుతున్న కష్టాలను ప్రజలు నాలుగున్నరేళ్లు ఓపికగా భరించారు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి సిద్ధమయ్యారు కాబట్టే, వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. . జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అయిపోయింది. రాష్ట్రానికి 60 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని జగన్ పదే పదే చెబుతున్నారు. ఆ కంపెనీలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. జగన్ సీఎం గా ఉండగా, రాష్ట్రానికి కంపెనీలు కూడా వస్తాయా అని ప్రజలే నవ్వుకునే పరిస్థితి ఇచ్చారు. పరిశ్రమలు తేవాలన్నా, సంపద సృష్టించాలన్నా చంద్రబాబుకే సాధ్యమవుతుందని నాగేశ్వరరావు అన్నారు. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నది ప్రజల ఆకాంక్ష. తాము ఓడిపోతామని వైసిపి నేతలే చెబుతున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి ఘనవిజయం సాధించడం ఖాయమని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను వారి ద్వారానే చెప్పిస్తూ, జగన్ కు మళ్లీ ఓటు ఎందుకు వేయకూడదో నాగేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి మంచి స్పందన కనిపించింది. చాలామంది మహిళలు గతంలో వైసీపీకి ఓటు వేసి తప్పు చేశామని చెబుతూ, ఈసారి తెలుగుదేశం పార్టీకే మద్దతిస్తామని బహిరంగంగానే తెలియజేయడం విశేషం. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, వార్డు అధ్యక్షుడు అత్తంటి శివకృష్ణ, గుత్తా శ్రీనివాసులు, అంబటి శ్రీనివాసులు, నల్లబోతుల మురళి, కొచ్చర్ల రమణయ్య, పీల.శ్రీనివాసులు, సవిడిబోయిన వెంకటకృష్ణ, సవిడిబోయిన సాయి, లాయర్ బెజవాడ కృష్ణయ్య, K .లక్ష్మీనారాయణ, మాచినేని మహేశ్వరరావు, చిలకపాటి శ్రీనివాసులు, అద్దంకి అనిల్, జమ్మూ చైతన్య, జనసేన నాయకులు ఆకురాతి శ్రీనివాసులు, గుణకాల గణేష్ నాయుడు, నాయకులు చిలకపాటి మధుబాబు, రెబ్బవరపు మాల్యాద్రి, రాయపాటి శ్రీనివాసరావు, వడ్డెళ్ల రవిచంద్ర, గొంది నరసింగరావు, ముచ్చు వేణు, షేక్ సలాం, షేక్ శతాక్షి, పులి నాగరాజు, కల్లూరి వెంకటేశ్వర్లు, షేక్ ఫిరోజ్, దారం విజయకుమార్, పసుపులేటి రమణయ్య, ముప్పవరపు వేణు, చుంచు వేణు గుమ్మ శివ, మచ్చ మనోహర్, షేక్ మమ్ముషా, పసుపులేటి నరేష్, చల్లా మహేంద్ర, షేక్ ఫాజిల్, లింగాబత్తిన మాల్యాద్రి, దార్ల సుబ్బారావు మరి ఇతర నాయకులు పాల్గొన్నారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :