Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు,: ఉలవపాడు మండలం రామాయపట్నం హైస్కూల్లో పనిచేస్తున్న పిడిని సస్పెండ్ చేయాలని లేని పక్షంలో దసరా సెలవుల అనంతరం పాఠశాలకు తాలాలు వేస్తామని ఆ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, పాలిపేట సర్పంచ్ రమణయ్య, గ్రామస్తులు విచారణకు వచ్చిన కందుకూరు డిప్యూటీ డీఈఓ కు తేల్చి చెప్పారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి నివేదిక అందించాలని డి ఈ ఓ ఆదేశించడంతో కందుకూరు డిప్యూటీ డిఈవో శనివారం ఆ పాఠశాలకు వచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు విచారణ అధికారి వద్దకు వచ్చి పిడి పై అనేక ఆరోపణలు చేశారు. ఇప్పటికే రెండోసారి ఆయనపై విచారణ చేసేందుకు వచ్చారని ఎన్నిసార్లు వచ్చినా తాము చెప్పేది ఒకటేనని ఆరోపణలు ఎదుర్కొంటున్న పిడిని సస్పెండ్ చేయాలని వారు కోరారు. పాఠశాలకు మారణాయుధాలతో రావడం ఎంతవరకు కరెక్ట్ అని అలా వస్తే విద్యార్థులకు ఏం సందేశం ఇవ్వనున్నారని వారు ప్రశ్నించారు. ఆ మేరకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డి ఈ ఓ మాట్లాడుతూ మీరిచ్చిన స్టేట్మెంట్ను ఉపాధ్యాయులు ఇచ్చే స్టేట్మెంట్లను నివేదిక రూపంలో డీఈఓ కు పంపనన్నట్లు తెలిపారు. తాను నివేదికలను ఉన్నతాధికారులకు పంపడం తప్ప చర్యలు తీసుకునే అధికారం తనకు లేదని ఆయన పేర్కొన్నారు.
Admin
Amaravathi Jyothi