Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు జిల్లా కలెక్టర్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వారి అధ్యక్షతన జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రేసల్ సిస్టమ్ (PGRS) కార్యక్రమమునకు 09 వ తేదీన ముందస్తు సమాచారము లేకుండా గైర్హాజరు కాబడినారు. అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించగా విధులకు తరచుగా గైర్హాజరు అయినారని కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గుర్తించినారు. కావున ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని శాసన సభ్యుని ఆదేశముల మేరకు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా నిర్లక్ష్యముగా మరియు క్రమశిక్షణా రాహిత్యంగా విధులకు గైర్హాజరు అయినారు అని గుర్తించడమైనది.కావున విధుల యందు మీ యొక్క నిర్లక్ష్య ధోరణి అవగతమవుచున్నందున ఈ షోకాజు నోటీసు అందిన 24 గంటలలోపు స్వయముగా గుడ్లూరు ఎంపీడీవో ఎదుట హాజరై మీరు మీ సమాధానమును సమర్పించవలెను. సకాలంలో మీ యొక్క సంజాయిషీ సమర్పించని యెడల మీ పై తగు చర్యలు తీసుకొనుటకు ఉన్నతాధికారులకు సిఫారసు చేయబడునని ఎంపీడీవో వై వెంకటేశ్వరరావు తెలియజేసారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి, ఉద్యానవన శాఖ అధికారికి,ఐ సి డి ఎస్ సూపర్వెజర్ గుడ్లూరు -2 కి , సర్వ శిక్ష అభియాన్ అధికారికి,ఎస్ సి వెల్ఫేర్ హాస్టల్ అధికారికి బి సి వెల్ఫేర్ హాస్టల్ అధికారికి,వెటర్నరి అసిస్టెంట్ సర్జన్ కి , పంచాయతీరాజ్, ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్లకు, రిజర్వ్ ఫారెస్ట్ అధికారికి,సోషల్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారికి , గుడ్లూరు ఈ ఓ ఆర్ డి కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు
Admin
Amaravathi Jyothi