Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ముస్లిం యువత రాజకీయాల్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఎస్ డి పి ఐ ఆకాంక్ష. కందుకూరు, అమరావతి జ్యోతి: అన్నీ రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా ముస్లీం యువత రాణించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కందుకూరు నియోజకవర్గం ప్రెసిడెంట్ షేక్ ముజీబ్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాలలో రాణిస్తూనే రాజకీయాలు అవగాహన చేసుకోవాలి అని అన్నారు ఈమధ్య వైయస్సార్ సిపి పార్టీ తరపున యువజన విభాగం జిల్లా సెక్రటరీగా ఎన్నికైన షేక్ మహబూబ్ బాషా కు అభినందనలు తెలియజేశారు మరింత ఉన్నత స్థాయి కి ఎదగాలని కోరుకుంటూ దుశ్శాలువను కప్పి మిఠాయిలు పంచిపెట్టారు ఈకార్యక్రమం షేక్ రసూల్, షేక్ సలీం, షేక్ మాబూబ్ బాషా, షేక్ మునాఫ్, షేక్ జాహిద్, షేక్ మసూద్, షేక్ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi