Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : పాఠశాలకు ఇన్వర్టర్ బ్యాటరీని అందజేసిన ఉపాధ్యాయురాలు. కడియం, అమరావతి జ్యోతి: రాజమండ్రి రూరల్ కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయరాలుగా పనిచేస్తున్న జివివి నాగమణి తన కుమార్తె పెళ్ళి రోజు సందర్భంగా పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ కు పదివేల రూపాయల విలువైన ఇన్వర్టర్ బ్యాటరీనీ ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణకు అందజేస్తారు. కరెంటు లేని సందర్భాల్లో ముఖ్యమైన పనులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని స్టాఫ్ కార్యదర్శి జి సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయునీ , ఉపాధ్యాయులు నాగమణిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాద్, శ్రీనివాస్, సువర్ణవేణి, అక్షయ, లీలావతి, ఫ్లోరెన్స్ పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi