Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు,అమరావతి జ్యోతి: బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి పొందటానికి నిర్వహించిన జాతీయోద్యమంలో ఎందరో మహానుభావులు అలుపెరుగని పోరాటాలు చేశారు. దేశ విముక్తి కోసం చేసిన పోరాటం ప్రపంచంలోనే అపూర్వమైనది. దీర్ఘకాలంగా సాగిన పోరాటంలో ఎంతోమంది స్ఫూర్తి ప్రదాతలు ప్రాణాలు త్యాగం చేశారు. వారి త్యాగ ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాత్రంత్రం. భారత దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకోవడం మన భాద్యతగా భావించాలి. స్వాత్రంత్ర్యం కోసం పోరాడిన త్యాగధనులకు నివాళులు అర్పిస్తూ గర్వంగా త్రివర్ణ పతకానికి సెల్యూట్ చేద్దాం. స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నియోజకవర్గ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
Admin
Amaravathi Jyothi