Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరులో విశ్వబ్రాహ్మణ నూతన కమిటీ ఎన్నిక కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు పట్టణంలో రాళ్ల వీధిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుడిలో నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు ఖజానా శేషయ్య ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు తిరువలూరి కృష్ణమాచారి గా, కామెర్ల విజయ్ కుమార్ ఆచారి, కామెర్ల వెంకటేశ్వర్లు, అధ్యక్షులు వడ్లమాని శేఖర్ ఆచారి, ఉపాధ్యక్షులు మధిర మధు ఆచారి, మధువరం వెంకటేశ్వర్లు ఆచారి, కందుకూరి బ్రహ్మం ఆచారి, ప్రధాన కార్యదర్శి విప్పగుంట గురవయ్య చారి , నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహవంతమైన ఆసక్తిపరుడు అల్లూరి చంద్రశేఖర్ ను యువజన అధ్యక్షులుగా ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈ కమిటీ క్రమం తప్పకుండా పలు కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే చేరిన కమిటీ సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించి. అనంతరం నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూరు పరిధిలో ఉన్న విశ్వ బ్రాహ్మణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi