Monday, 15 June 2026 03:49:18 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

సానుభూతి డ్రామాలు చెల్లవు జగన్ ఎమ్మెల్యే స్వామి

Date : 14 April 2024 10:53 PM Views : 374

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : సానుభూతి డ్రామాలు చెల్లవు జగన్ : ఎమ్మెల్యే స్వామి పొన్నలూరు,అమరావతి జ్యోతి : ప్రతి ఎన్నికల్లో సానుభూతి డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండరని కొండపి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మండల కేంద్రమైన పొన్నలూరులో ఆదివారం ఏర్పాటు చేసిన 133వ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సీఎం జగన్ సానుభూతి డ్రామాలు వేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చౌకబారు పనులు చేయడం తగదని సూచించారు. వైకాపా అభ్యర్థి సురేష్ నియోజకవర్గంలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి కార్యకర్త కష్టపడి ఇంటింటికి చంద్రబాబు ప్రకటించిన బాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్వామి సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని గెలిపించాలని స్వామి కోరారు. ముందుగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కేక ని కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు, మాజీ అధ్యక్షులు మండవ ప్రసాద్, సీనియర్ నాయకులు కర్ణ కోటిరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు కుర్ర మల్యాద్రి, ఎస్సీ సెల్ అధ్యక్షులు అరోణ్, ఒంగోలు పార్లమెంట్ ఎస్టి సెల్ ప్రధాన కార్యదర్శి రాపూరి కోటేశ్వరమ్మ, తోపాటు పలు గ్రామాలకు చెందిన టిడిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :